Ranbir Alia: ఆలియా భట్‌కు రణభీర్ కపూర్ కాస్ట్‌లీ గిఫ్ట్.. పెళ్లిలోనే..
Ranbir Alia: కాబోయే భార్య కోసం రణభీర్ ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ను ప్రత్యేకంగా చేయించినట్టు టాక్.;
Ranbir Alia: బాలీవుడ్‌లో ఎంతోమంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇన్నేళ్ల బాలీవుడ్ హిస్టరీలో గతేడాదే చాలామంది నటీనటులు పెళ్లి పీటలెక్కారు. అయితే లవ్ బర్డ్స్ ఆలియా, రణభీర్ కూడా గతేడాదే పెళ్లి చేసుకోవాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. ఫైనల్‌గా ఇప్పుడు వీరి పెళ్లి విషయంలో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కాబోయే భార్య కోసం రణభీర్ ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ను ప్రత్యేకంగా చేయించినట్టు టాక్.
ఆలియా భట్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి పలువురు హీరోలతో రిలేషన్‌లో ఉందని రూమర్స్ వచ్చినా.. అవేవి నిజం కాదని తేలిపోయింది. తనకు చిన్నప్పటి నుండి రణభీర్ అంటే క్రష్ అని ఓ ఈవెంట్‌లో తనకు అందరి ముందు ప్రపోజ్ చేసింది. ఇక రణభీర్ పలువురు హీరోయిన్లతో బ్రేకప్ చేసుకున్న తర్వాత చాలాకాలంగా సింగిల్‌గానే ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరు పెళ్లితో ఒక్కటవ్వనున్నారు. అంటే ఆలియా తన చిన్ననాటి క్రష్‌ను పెళ్లి చేసుకోనుంది.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లాగానే రణభీర్, ఆలియా కూడా సీక్రెట్‌గా పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికీ వీరి పెళ్లి తేదీ ఏంటి అని ప్రేక్షకులకు క్లారిటీ లేదు. అయితే పెళ్లిలో ఆలియా ధరించడం కోసం రణభీర్ 8 వజ్రాలతో చేయించిన వెడ్డింగ్ బ్యాండ్‌ను తయారు చేయించాడట. రణభీర్‌కు 8 లక్కీ నెంబర్ కాడంతో 8 వజ్రాలను ఎంపిక చేసినట్టు టాక్. ఇదిలా ఉండగా వీరి పెళ్లి ఫోటోలు ఎప్పుడెప్పుడు బయటికి వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.