Ranjithame song from Varisu: మరో సెన్సేషనల్ బీట్ సాంగ్.. 25 రోజుల్లో 75 మిలియన్ల వ్యూస్
Ranjithame song from Varisu: తలపతి విజయ్, రష్మిక మందన్న నటించిన ఫ్యామిలీ డ్రామా వారిసు. ఈ చిత్రం నుంచి వచ్చిన మొదటి ట్రాక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది.;
Ranjithame song from Varisu: తలపతి విజయ్, రష్మిక మందన్న నటించిన ఫ్యామిలీ డ్రామా వారిసు. ఈ చిత్రం నుంచి వచ్చిన మొదటి ట్రాక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ తెలుగులో విడుదల చేసారు యూనిట్ సభ్యులు. రంజితమే, రంజితమే అంటూ సాగే ఈ పాట సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. ఎస్ థమన్ ఈ పాటను స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి, మానసి ఆలపించారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వారిసు చిత్రంలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హరి, ఆశిషోర్ సోలమన్‌తో కలిసి వంశీ పైడిపల్లి వారిసు కథ రాశారు. సాంకేతిక బృందం కెఎల్ ప్రవీణ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీని చూస్తున్నారు. శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
వారిసు హిందీ విడుదల
ఇటీవల, ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వారిసు నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ తెలుగు మరియు తమిళంతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు. ఈ చిత్రాన్ని 2023లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
చట్టంతో ఇబ్బంది
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తమ అనుమతి లేకుండా షూటింగ్ సమయంలో ఐదు ఏనుగులను వాడుకున్నందుకు గాను జంతు సంక్షేమ సంఘం చిత్ర నిర్మాతలకు ఇటీవల నోటీసు జారీ చేసింది. దీనిపై వచ్చే ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అధికారులు బృందాన్ని కోరారు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా స్పందించలేదు.
వారిసు సినిమా పూర్తి చేసిన తర్వాత, దళపతి విజయ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో పని చేయనున్నారు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది.