Rashmika Mandanna: 'రష్మిక హీరోయిన్ కాదు హీరో'.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rashmika Mandanna: పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్‌ను హ్యాపీగా గడిపేస్తోంది రష్మిక మందనా.;
Rashmika Mandanna: కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి అతి తక్కువ సమయంలోనే గోల్డెన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్ రష్మిక మందనా. హీరోయిన్‌గా అలా అడుగుపెట్టిందో లేదో.. అప్పుడే తెలుగులోని పలువురు స్టార్లతో జోడీకట్టేసింది రష్మిక. ఇక ప్రస్తుతం తాను ఓవైపు హిందీ సినిమాలతో బిజీగా ఉండగానే.. మరోవైపు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్‌ను హ్యాపీగా గడిపేస్తోంది. ఇదే సమయంలో రష్మికపై ఓ యంగ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అల్లు అర్జున్‌తో నటించిన 'పుష్ప' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రష్మికకు కూడా పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ వచ్చింది. ఇక దాని తర్వాత నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఫ్లాప్ అయినా కూడా రష్మిక.. పుష్ప పార్ట్ 2 సక్సెస్‌పై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక హిందీలో మూడు సినిమాలతో పాటు తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటి చిత్రాలతో బిజీగా ఉంది రష్మిక.
యూత్‌ఫుల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు దుల్కర్ సల్మాన్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమే 'సీతారామం'. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్ విడుదలయ్యింది. ఇందులో దుల్కర్ సల్మాన్‌తో పాటు రష్మిక మందనా, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ మృణాలా? రష్మికానా? అని అడిగిన ప్రశ్నకు హను ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ కాదని హీరో అని అన్నాడు హను. సీతారామంలో రష్మిక చేస్తున్న అఫ్రీన్ రోల్ కోసం చాలా కష్టపడిందని అన్నాడు. అఫ్రీన్ పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి చివరికి రష్మికను ఫైనల్ చేసినట్టు హను తెలిపాడు. రష్మిక కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్‌ను చూపిస్తుందని, తన యాక్టింగ్ చూసి షాకయ్యానని చెప్పాడు హను రాఘవపూడి.