ప్రభాస్ తర్వాత రష్మిక మందన్నానే టాప్.. పోలిక కాస్త ఇబ్బందిగా ఉన్నా ఒక్క విషయంలో ఇది నిజం. ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ ను బీట్ చేసే స్టార్ ఇప్పట్లో రాడు అనుకున్నారు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లైన్ లో ఉన్నారు. అయినా ఇప్పటికే రెబల్ స్టార్ నాలుగైదు సినిమాలతో చాలా ముందుకు వెళ్లిపోయాడు. బాహుబలి, రెండు భాగాల తర్వాత సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి వంటి మూవీస్ తో ఖలేజా చూపించాడు. వీటిలో రాధేశ్యామ్ మాత్రమే కాస్త డిజప్పాయింట్ చేసినా.. ప్యాన్ ఇండియా స్టార్ అనే మాటకు సరిపోయేంత బజ్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం భారీ చిత్రాలతో రెడీ అవుతున్నాడు డార్లింగ్. ఇక సౌత్ నుంచి ప్యాన్ ఇండియా స్థాయిలో ఇంపాక్ట్ ఫుల్ మూవీస్ తో ఆకట్టుకున్న బ్యూటీ రష్మిక మందన్నానే కావడం విశేషం.
రెండేళ్లలోనే మూడు సినిమాలతో దేశవ్యాప్తంగా రియల్ నేషనల్ క్రష్ అనిపించుకుంది రష్మిక. లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్, పుష్ప2 బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్ గా తన పాత్రలు బలంగా ఉన్నాయి. తనూ అద్భుతంగా నటించింది. ఏదో హీరోయిన్ ఉంది అంటే ఉందీ అన్నట్టుగా కాకుండా ఆమె క్యారెక్టరైజేషన్ కు స్ట్రెంత్ కనిపిస్తుంది పాత్రల్లో. ఇక లేటెస్ట్ గా వచ్చిన ఛావా మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలోనూ ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య యషూ బాయి పాత్రలో మరోసారి గొప్ప నటన చూపించింది. ఆమె పాత్రకు, నటనకు ప్రత్యేక ప్రశంసలు కూడా వస్తున్నాయి. తను గొప్పగా నటించడమే కాదు.. ఆయా సినిమాల ప్రమోషన్స్ లో తనదైన మార్క్ ను చూపిస్తుంది. ఛావా విషయమే తీసుకుంటే తన కాలుకు పెద్ద దెబ్బ తగిలింది. అయినా స్ట్రెచర్ పై వెళ్లి మరీ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసి సినిమాపై తన ప్యాషన్ ను చాటుకుంది. హైట్ తక్కువే అయినా ఎంత వెయిట్ ఉన్న పాత్రైనా అలవోకగా చేస్తూ అలరిస్తోంది రష్మిక. సో.. ప్రభాస్ తర్వాత ప్యాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధించిన బ్యూటీ అనే అని చెప్పాలి. ఇక హీరోలంటారా.. వాళ్లకు ఉండే అన్ని ఫెసిలిటీస్ హీరోయిన్లకు ఉండవు కదా.