Rashmika Mandanna : శభాష్ రష్మిక మందన్నా..

Update: 2025-06-21 08:28 GMT

సౌత్ లోనే కాదు.. నార్త్ లో కూడా స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక మందన్నా. ముందు నుంచీ పర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ పండించడంలో కూడా ఎలాంటి అభ్యంతరాలూ లేని హీరోయిన్ గా ఆకట్టుకుంది. యానిమల్ మూవీలో తన నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. ప్రస్తుతం ఇండియాలో మూడు వేల కోట్ల క్లబ్ లో ఉన్న ఏకైక హీరోయిన్ తను. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతోందీ నేషనల్ క్రష్. విశేషం ఏంటంటే.. తన కథల్లో తనకు ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. కేవలం హీరో సరసన ఆడిపాడటమే కాదు.. నటనను చూపించే ఆస్కారంతో పాటు కథల్లో అత్యంత కీలకంగా ఉంటూ వస్తోంది. పుష్ప రెండు భాగాలు, యానిమల్, ఛావా లాంటి చిత్రాలు చాలు తనెంత క్లెవర్ గా కథలు సెలెక్ట్ చేసుకుంటుందో తెలియడానికి. తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర చిత్రంలో సమీర పాత్రలో మరోసారి అద్భుతమైన నటన చూపించింది. 

ఇక లేటెస్ట్ గా వచ్చిన కుబేర చూసిన ప్రతి ఒక్కరూ శభాష్ రష్మిక అంటున్నారు. అమాయకత్వం, జాలి కలబోసిన పాత్రలో అనుకోకుండా ఓ పెద్ద ఇష్యూలో ఇరుక్కుని చాలా చాలా అమాయకుడైన హీరోను అదే పనిగా తిడుతూ అనివార్యంగా అతనితోనే ట్రావెల్ అయ్యే పాత్ర. తన స్టార్డమ్ కు ఏ మాత్రం సంబంధం లేని రోల్ ఇది. అయినా సరే పాత్రలోని డెప్త్ ను అర్థం చేసుకుంది తను. అందుకే ఈ కథకు ఓకే చెప్పింది. సమీర అనే పాత్రకు ఇప్పుడు అద్భుతమై స్పందన వస్తోంది. ఆమె నటనకు మరోసారి జనం ఫిదా అయిపోతున్నారు. ఎక్కడా రష్మిక మందన్నా కనిపించదు. కేవలం సమీర మాత్రమే కనిపిస్తుంది. అంత గొప్పగా నటించింది. సినిమా విజయంలో తనూ ఓ కీలక పాత్రే అని చెప్పొచ్చు. అన్నిటికంటే ఎక్కువగా.. ధనుష్ తో పాటు ఒరిజినల్ డంప్ యార్డ్ లో నటించింది తను. హీరోయిన్లు అంటే ఎంతో సుకుమారంగా ఉంటారు అని అందరికీ తెలుసు. అలాంటి తను ఇలా ఏకంగా డంపింగ్ యార్డ్ లో దొర్లుకుంటూ రావడం, క్లైమాక్స్ మొత్తం అందులోనే ఉండటం అంటే తనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలకు ఒప్పుకోరు. ఆ ప్యాషన్ చూపిస్తోంది కాబట్టి తను నేషనల్ క్రష్ అయింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో భాగం అవుతోంది. 

Tags:    

Similar News