వరుస ప్రాజెక్ట్స్ తో కెరీర్ టాప్ గేర్ లో ఉంది రష్మిక మందన్నా. పుష్ప 2లో తన నటనకు థియేటర్స్ లో క్లాప్స్ పడుతున్నాయి. గ్లామర్, రొమాన్స్, నటన పరంగా ది బెస్ట్ అనిపించుకుందీ మూవీలో. ప్రస్తుతం తన ఖాతాలో ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఛావా, సికందర్ హిందీ సినిమాలు. తెలుగులో తనే మెయిన్ లీడ్ లో నటిస్తోన్న రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్ తో పాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర మూవీస్ ఉన్నాయి. ఇవి కాక లేటెస్ట్ గా మరో కోలీవుడ్ మూవీలో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా కోలీవుడ్ లో అమరన్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ సరసన రష్మిక మందన్నా నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ రష్మిక కోలీవుడ్ లో పాగా వేయాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.విజయ్ వంటి టాప్ హీరో సరసన నటించినా తనకు స్టార్డమ్ రాలేదు. అంతకు ముందు కార్తీతో సుల్తాన్ చేసినా వర్కవుట్ కాలేదు. మరి శివకార్తికేయన్ తో అంటే ఇప్పుడు అతని రేంజ్ మారింది. అమరన్ తర్వాత అతన్నీ టైర్ 1 హీరో అంటున్నారు. శిబి చక్రవర్తి డైరెక్ట్ చేయబోతోన్న ఈ ప్రాజెక్ట్ లో రష్మిక నటించబోతోందా లేదా అనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది.