ఐకాన్ స్టార్ అల్లు అర్జును హీరోయిన్ రష్మిక ఓ స్పెషల్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. 'ఎవరికైనా మనం వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుందని మా అమ్మ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్, మీకు మరింత లక్, పాజిటివిటీ, ప్రేమ అందిస్తాయని నమ్ముతున్న. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు' అని రష్మిక ఓ లేఖ పంపింది. దీన్ని బన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేస్తూ.. 'థాంక్యూ మై డియర్.. ఇప్పుడు చాలా అదృష్టం కావాలి' అని రాసుకొచ్చారు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. ‘బాక్సాఫీస్ వద్ద 'పుష్ప' తప్పకుండా రూల్ చేస్తుంది. మన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేక్షకులు మన శ్రమను గుర్తిస్తారు. ఆ విషయంలో నేను ఎంతో నమ్మకంతో ఉన్నా' అని పేర్కొన్నారు. మరోవైపు సుకుమార్ డైరెక్షన్లో పుష్ప-1లో అల్లు అర్జున్ ఊరమాస్ యాక్షన్, శ్రీవల్లిగా రష్మిక నటన సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి కొనసాగింపుగా 'పుష్ప -2' సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న ఇది రిలీజ్ కానుంది