మాస్ మహరాజ్ రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ టీజర్ చూసిన తర్వాత మాగ్జిమం రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఆ సినిమా ఒరిజినల్ కథలో ఓ డెప్త్ ఉంటుంది. ఇంటెన్సిటీ కనిపిస్తుంది. నల్లధనం వల్ల దేశం ఎంత వెనకబడింది అనేది రియలిస్టిక్ గా కనిపిస్తుంది. బట్ బచ్చన్ టీజర్ చూసిన తర్వాత అత్యంత ఆకతాయిగా కనిపించిందనే కమెంట్స్ వస్తున్నాయి. రవితేజ ఇమేజ్ కోసం అంటూ హరీశ్ శంకర్ అనేక మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. ఈ మార్పుల్లో ఏదీ ఒరిజినల్ లో ఉండదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించడమే టార్గెట్ గా హరీశ్ ఈ మూవీ రూపొదించినట్టే అని అర్థం చేసుకోవాలి. కానీ టీజర్ తో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్నది రవితేజ మరో శ్రీ లీలను తయారు చేస్తున్నాడా.. అని.
ధమాకా మూవీతో శ్రీ లీల ఓవర్ నైట్ టాలీవుడ్ హాట్ ఫేవరెట్ అయింది. అమ్మడి హైపర్ యాక్టివ్ నెస్ కు టాలీవుడ్ ఫిదా అయింది. అంతే ఆఫర్లే ఆఫర్లు. కట్ చేస్తే అంతే వేగంగా ఫ్లాపులే ఫ్లాపులు అన్నట్టుగా మారింది పరిస్థితి. ఏకంగా అడ్వాన్స్ లు ఇచ్చిన తర్వాత కూడా నితిన్, విజయ్ దేవరకొండ సినిమాల నుంచి అమ్మడిని తీసేశారు. అయితే ఈ మూవీకి ముందు తర్వాత కూడా రవితేజ శ్రీ లీలను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశాడు. తనకంటే ఆమె కెరీరే ఇంపార్టెంట్ అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు.
అచ్చం శ్రీ లీలలాగానే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని టాలీవుడ్ లో నిలబెట్టే బాధ్యత తీసుకున్నాడా అన్న రేంజ్ లో కనిపిస్తోంది పరిస్థితి. ఈ మూవీలో డ్యూయొట్స్ పేరుతో ఆ హీరోయిన్ తో చేయించిన భంగిమలు( ఈ పదం దర్శకుడికి నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.. కాన ఆ స్టెప్పులకు ఈ పదమే కరెక్టేమో ) చూసి ఇతర హీరోలు కూడా ఆశ్చర్యపోయారు. రవితేజ ఈ వయసులో ఆ స్టెప్స్ చేయడం చూసి గుసగుసలు పోయారు. కొన్నాళ్లుగా మాస్ రాజా పూర్తిగా కొత్త అమ్మాయిలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది నా పరిధిలోని అంశం కాదు అని చెప్పినా.. హీరో ఎస్ చెప్పకుండా హీరోయిన్ ను ఫైనల్ చేసేంత ధైర్యం రవితేజ దర్శకులకు ఉంది అనుకోలేం.
మూవీ ప్రెస్ మీట్ లో కూడా దాదాపు భాగ్య శ్రీని హైలెట్( రవితేజ అని అర్థం కాదు ) చేయిస్తున్నారు. తను కూడా టాలీవుడ్ లో పాగా వేయడమే లక్ష్యంగా ‘స్టెప్పులు ’కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆల్రెడీ విజయ్ దేవరకొండ సరసన ఆఫర్ అందుకుంది అంటున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓకే కాబోతున్నాయి. సో.. వరస చూస్తుంటే ధమాక తర్వాత శ్రీ లీల లాగే దూసుకుపోయేలా కనిపిస్తోంది. ఏదైనా రవితేజ హ్యాండ్ మహత్యం అది అనుకోవచ్చు.. అంటే ఆయన సినిమాతో పరిచయం అయిన హీరోయిన్స్ ‘కొందరు’ఇలాగే దూసుకుపోతారేమో..