Raviteja in Rajinikanth's Coolie : రజినీకాంత్ కూలీలో రవితేజ కూడానా..?

Update: 2024-08-30 09:46 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసులో కూడా నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తూ యూత్ కు గట్టి పోటీ ఇస్తున్నాడు. రీసెంట్ గా జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్.. నెక్ట్స్ వేట్టైయాన్ అనే మూవీతో రాబోతున్నాడు. అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రం తెలుగులో కూడా వేటగాడు టైటిల్ తో విడుదలవుతుంది. వేటగాడు తర్వాత కూలీగా వస్తాడని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. తమిళ్ లో చాలా తక్కువ టైమ్ లోనే ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా మారిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మూవీ చేస్తున్నాడు రజినీకాంత్. ఈ మూవీలో డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి కాస్టింగ్ ను తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో తెలుగు నుంచి ఆల్రెడీ నాగార్జునను సైమన్ అనే పాత్రలో తీసుకున్నట్టు నిన్న నాగ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ తో సహా అనౌన్స్ చేశాడు. అంతకు ముందే కన్నడ నుంచి ఉపేంద్ర కూడా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. లేటెస్ట్ గా మన మాస్ మహరాజా రవితేజను కూడా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

రవితేజ కెరీర్ మొదలైందే నలుగురులో ఒకడుగా. హీరోగా మారిన తర్వాత ఎన్నో హిట్స్ చూశాడు. ప్రస్తుతం కొంతకాలంగా వరుస డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ తన కెరీర్ ఆరంభంలో లాగా మరీ నలుగురిలో ఒకడు అని కాదు కానీ.. మల్టీస్టారర్స్ చేసుకోవడం బెటర్ అనే కమెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కూలీ మూవీలో నిజంగా ఆఫర్ వస్తే అతను ఓకే చెప్పడం చాలా బెటర్. ఇది తన కెరీర్ కు ప్లస్ అవుతుంది. అలాగే ఈ సినిమాతో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం అయినట్టూ ఉంటుంది. ఎలాగూ అతని ఇమేజ్ కు తగ్గ పాత్రనే డిజైన్ చేసి ఉంటాడు కాబట్టి మాస్ రాజా కూలీలో ఉంటే అతనికే ఎక్కువ ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ప్రచారమా లేక నిజంగానే అతన్ని అప్రోచ్ అయ్యారా అన్నది తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News