Pratyusha : హీరోయిన్ ప్రత్యూష హత్య కేస్ లో 24యేళ్ల తర్వాత రిజల్ట్

Update: 2026-02-17 08:41 GMT

సినీ నటి ప్రత్యూష ఆత్మ(హత్య) కేస్ విషయంలో సుప్రీకోర్ట్ సరికొత్తగా ఆదేశాలిచ్చింది. ఆమె హత్యకు కారణమైన సిద్ధార్థ్ రెడ్డి ఇన్నేళ్లుగా ఈ కేస్ లో తప్పు చేయలేదు అని పోరాటం చేస్తున్నాడు. కానీ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఇది హత్యే అని అని బలంగా నిలబడింది. మొత్తంగా ఈ కేస్ లో సిద్ధార్థ్ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్ట్ ధర్మాసనం తీర్పునిచ్చింది. 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష హత్య జరిగింది. ఈ కేస్ లో అనేకమంది రాజకీయ నాయకులు బలవంతం చేయడంతో కేస్ పెట్టలేదు. ఆమెది కేవలం ఆత్మహత్య అని పోలీస్ ల నిర్ధారించారు. కానీ ప్రజా సంఘాల మద్ధతుతో ఆమె తల్లి సరోజినీ దేవి పోరాటం చేసింది. దీంతో పోలీస్ లు కేస్ నమోదు చేశారు. దీంతో 2004లో కోర్ట్ లో అతనికి 5 యేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించింది. అయితే ఈ శిక్ష కాలాన్ని కూడా తగ్గించాలని సిద్దార్థ్ రెడ్డి కోరడంతో రెండేళ్లు కేస్ తగ్గించింది. ఇదంతా హై కోర్ట్ లో సాగిన ప్రహసనం. దీంతో సరోజినీ దేవి సుప్రీమ్ కోర్ట్ లో తన పోరాటాన్ని కొనసాగించింది. ఇన్నేళ్ల తర్వాత అతనికి శిక్ష పడటం ఖాయం అని తేలిపోయింది. అయితే ఆ శిక్ష పూర్తి స్థాయిలో పడలేదు. కేవలం అతని 5యేళ్ల కాలం మాత్రమే ఉండాలి అని సుప్రీమ్ కోర్ట్ తీర్పునిచ్చింది. అంటే మిగతా రెండేళ్లు మాత్రం అతను శిక్ష ఎదుర్కొవాల్సిందే అని స్పష్టం చేసింది.

అయితే సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవడం మాత్రమే కాదు.. అతని తప్పుకు శిక్ష పూర్తి కాలం పడాల్సిందే అనేది సరోజినీ దేవి వాదన. ఈ కేస్ లో పూర్తి స్థాయిలో ప్రత్యూషకు న్యాయం జరగలేదు. ఈ కొద్ది కాలం శిక్షతోనే అతను సరిపెట్టుకోవడం అనేది మాత్రం చెబుతోంది ఆమె. మొత్తంగా ఐదేళ్ల పాటు శిక్ష మాత్రం ఖరారు చేసింది సుప్రీమ్ కోర్ట్. ఈ కేస్ లో నాలుగు వారాల్లో లొంగిపోవాల్సింది అని ఆదేశించింది. మొత్తంగా దాదాపు 24యేళ్ల తర్వాత ఈ కేస్ లో మళ్లీ శిక్ష పడటం మాత్రం కొంత మేరకు సరోజినీ దేవికి రిలీఫ్. 

Tags:    

Similar News