మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ సూర్య సినిమా అంటే అతని గత చిత్రాల రిజల్ట్స్ తో పనిలేకుండా ఎగబడే ఫ్యాన్స్ అన్ని భాషల్లో ఉన్నారు. మరి ఇంత అభిమానానికి విజయాలు కూడా తోడైతే ఆయన రేంజ్ కూడా మారుతుంది. ఈ క్రమంలో కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు సూర్య. అందుకు కారణం కొన్ని ప్రయోగాలు చేయడమే అనేది కాదనలేని సత్యం. అదే టైమ్ లో ఆ ప్రయోగాలు అతనికి విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు కూడా తెచ్చాయి. జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటివి ఉదాహరణ అయితే. పడ్డ కష్టం అంతా వృథా అనిపించేలా చేసింది కంగువా లాంటి మూవీస్.
ఇక ఇప్పుడు రూట్ మార్చాడు. మళ్లీ తనదైన మాస్ పంథా స్టార్ట్ చేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ‘రెట్రో’ అనే మూవీ చేస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ టీజర్ కు తమిళ్ తో పాటు తెలుగులోనూ అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా సూర్య లుక్స్ కు చాలామంది ఫిదా అయిపోతున్నారు. రౌడీ బాయ్ నుంచి గుడ్ మేన్ గా ఎదిగే క్రమంలో సినిమా రూపొందుతున్నట్టు కనిపిస్తోంది. ఇక పూజా హెగ్డే కూడా తన రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు భిన్నంగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించబోతోందని అర్థం అవుతుంది.
ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను పంచుకుంది టీమ్. రెట్రోలో ఒక పాట ఫైట్ ఒకేసారి వస్తాయట. ఆ సీక్వెన్స్ కోసం నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ చేశారట. ఆ ప్రాక్టీస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే.. ఆ మొత్తం సీక్వెన్స్ ను సింగిల్ షాట్ లో షూట్ చేశారట. అంటే టీమ్ అంతా ఎంత పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసినా సింగిల్ షాట్ లో కంప్లీట్ చేయడం చాలా పెద్ద టాస్క్. ఆ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసింది టీమ్. ఈ సీక్వెన్స్ సినిమాలో అత్యంత కీలకంగా కూడా ఉంటుందట. మరి సూర్య డెడికేషన్ కు తగ్గ రిజల్ట్ వస్తే ఇంకా బావుంటుందేమో. ఇక ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయబోతున్నారు.