RGV : 'కేసీఆర్ బయోపిక్ తీస్తా'.. వర్మ సంచలన ప్రకటన..!
RGV : వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..;
RGV : వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా మరో సంచలన ప్రకటనతో టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు వర్మ... తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయోపిక్ తీస్తానని అనౌన్సు చేశాడు వర్మ.
డేంజరస్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ ఈ ప్రకటన చేశాడు. అలాగే తనకు 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం బాగా నచ్చిందని, త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తానని, దీనికి సంబంధించిన విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు. కాగా పలు వేదికలపైన కేసీఆర్ అంటే తనకి చాలా ఇష్టమని బహిరంగంగానే ప్రకటించాడు వర్మ.
అటు ఏపీ టికెట్ రేట్ల విషయంలో తనకు ఇబ్బంది లేదని అలాగే తన సినిమాను ఓటీటీ, థియేటర్ రెండింటిలోనూ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.