Anirudh : కింగ్ డమ్ ప్రీ రిలీజ్.. అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్

Update: 2025-07-28 08:34 GMT

అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అంటే సినిమాకు సగం బలం అని నమ్ముతున్నారు చాలామంది. అది నిజమే అనేలా అతనూ అదరగొడుతున్నాడు. కాకపోతే తమిళ్ మూవీస్ లో కనిపించే సౌండ్ తెలుగు సినిమాల్లో ఉండదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నా.. ఇప్పుడు కింగ్ డమ్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు. తిరుపతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ లో జరగబోతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు అనిరుధ్.

అనిరుధ్ లైవ్ అంటే ఖచ్చితంగా సినిమాపై అంచనాలు పెంచుకోవచ్చు అంటారు. అతను లైవ్ కు ఒప్పుకున్నాడు అంటే మూవీలో మేటర్ ఉన్నట్టే అనే ప్రచారం కూడా ఉంది. పైగా మనోడు సూపర్ బిజీ. ఇంత బిజీలో ఈవెంట్ లో లైవ్ చేయడానికి వస్తున్నాడు అంటే సినిమాకు ప్రమోషనల్ గా కూడా బాగా కలిసొస్తుంది. అలాగే ఈవెంట్ లో విజయ్ దేవరకొండ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందట. మరి ఈ ఇద్దరు కలిసి ఏం మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.

Tags:    

Similar News