Rowdy Janardhan : రౌడీ జనార్ధన.. ఏదో తేడాగా ఉందే..

Update: 2025-12-23 11:00 GMT

విజయ్ దేవరకొండ మూవీస్ అంటే మాగ్జిమం రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో ఓ రకమైన పాజిటివిటీ కనిపించేది. రిజల్ట్ తర్వాత ఏంటనేది అందరికీ తెలుసు. కొన్నిసార్లు కావాలని నెగెటివ్ చేయడం కూడా కనిపిస్తుంది. బట్ రౌడీ జనార్ధన మాత్రం ముందే తేడాగా కనిపిస్తోంది. ఆ పాత్ర ఏంటీ ఎలా ఉండబోతోంది అనిపించేలా లేకపోవడం పెద్ద మైనస్ గా కనిపించడం ప్రధానంగా ఉంది. చాలా మందికి ఈ పాత్ర ఎలా ఉంటుందా అని ఆ సినిమాల ఫస్ట్ లుక్, టీజర్, గ్లింప్స్ ద్వారా కొంత వరకు అర్థం అవుతుంది. కానీ రౌడీ జనార్ధన్ మాత్రం అలా లేకపోవడం తేడాగా ఉంది. ఇలాంటి మూవీపై ఓ క్లారిటీ ఉండటం ఇంపార్టెంట్.

‘బండెడు అన్నం తిని.. కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా ఇన్నావా.. కొమ్ములతో ఆడి కథను ఆడి రాసుకున్నాడు.. కన్నీళ్లను ఒంటికి నెత్తుర్లాగ పూసుకొన్నాడో.. కత్తెగరేసి కలబడ్నోడు.. కలబడ్డాడు.. నా లోపలా..’అనే ఓ డైలాగ్.. దాంతో పాటు జనాలను తెగ నరికేస్తూ కనిపించే హీరో.. ‘మా కాడ ఉన్నారు.. మాకొమ్ముల్దిరిగిన రాక్షసులు.. రక్తం మరిగిన రౌడీలు..’ అనే మరో డైలాగ్ వస్తుంటే.. దానికి ‘కళింగ పట్నంల ఇంటికో లం.. కొడుకుని రౌడీని అని చెప్పుకుని తిరుగుతా.. కానీ ఇంటి పేరు రౌడీ మార్చుకున్నడా.. ఒక్కడో ఉన్నడు.. జనార్ధనా.. రౌడీ జనార్ధనా..’ అంటూ హీరో డైలాగ్ తో వస్తాడు. చూస్తుంటే.. ఈ కథలో కొత్తదనం ఏం కనిపించలేదు అనేలా ఉంది. తనలో తనే కలబడ్డాడు ఒకడు ఉన్నాడు అంటే.. వాడిలో వాడు కలబడటం ఎందుకు అనేది కదా అవసరం.. ఆ అవసరాన్ని ఏంటీ అనేది కథలో ఉంటుందేమో కాబట్టి.. సరిపోతుంది. బట్ .. ఏమంత ఆకట్టుకునేలా మాత్రం కనిపించలేదు ఈ టైటిల్ గ్లింప్స్. అదేదో నరకడం మాత్రంగా కనిపిస్తోంది. అంతే. అంతే తప్ప ఈ గ్లింప్స్ లో ఏమాత్రం కొత్తదనం కనిపించడం లేదు. 

Tags:    

Similar News