'ఆర్ఆర్ఆర్' టీమ్ నుంచి స్పెషల్ ట్వీట్.. ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ
RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అతి పెద్ద యాక్షన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.;
RRR: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అతి పెద్ద యాక్షన్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మరొకరు ఏమో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అల్లురి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇటీవలే యూక్రెయిన్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది.
ఈ సినిమాను మొదట విజయదశమి కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందనే నేపథ్యంలో సినిమా విడుదల సంక్రాంతికి వాయిదాపడే అవకాశం ఉందని కథనాలు పుట్టుకొచ్చాయి.
ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్లు, 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్', ఫస్ట్ సింగిల్ 'దోస్తీ' ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ పై తాజాగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ స్పష్టత ఇచ్చింది. 'నవంబర్ 19, 2018లో ఏ బైక్ షాట్‌తో సినిమా షూటింగ్ ప్రారంభించామో.. చివరి షాట్ కూడా బైక్ షాట్ కావడం విశేషం రెండు పికప్ షాట్లు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాం. ' అంటూ యూనిట్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి బాణీలు కట్టారు. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.