'కాంతార: ఎ చాప్టర్ 1' చిత్రం నుండి నటి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ విడుదలైంది. హోంబలే ఫిలింస్ ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. కనకవతి పాత్రను పరిచయం చేస్తున్నాం అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రాజసం ఉట్టి పడేలా రుక్మిణీ లుక్ అదిరిపోయింది. 'కాంతార: ఎ చాప్టర్ 1' అనేది 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'కాంతార'కు ప్రీక్వెల్. అంటే, మొదటి భాగంలోని సంఘటనలకు ముందు ఏం జరిగిందో ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ సినిమాకు కూడా నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. రుక్మిణి వసంత్ అంతకుముందు తెలుగులో 'సప్త సాగరాలు దాటి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు 'కాంతార: ఎ చాప్టర్ 1'లో ఆమె నటన ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ 64వ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. 96, మెయ్యళగన్ వంటి చిత్రాల ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.