Allu Arjun : అల్లు అర్జున్ పై అదిరిపోయే రూమర్స్

Update: 2026-01-06 11:26 GMT

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పై అదిరిపోయే రూమర్స్ వస్తున్నాయి. కొత్తగా వస్తోన్న కథలు అంటూ రకరకాల మనుషుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక దర్శకులకే లెక్కే లేకుండా పోయింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో మాత్రమే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా అతనితో పాటుగా వినిపిస్తున్నాయి. ఫిక్షన్ మూవీగా రూపొందుతోంది. ఓ రేంజ్ లో యాక్షన్ కంటెంట్ తో రూపొందుతోంది ఈ మూవీ. అన్నీ కుదిరితే ఈ యేడాది దసరాకు విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు వీళ్లు. ఈ లోగా అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అంటూ వినిపిస్తోన్న పేర్లు మామూలుగా వినిపించడం లేదు. ఈ పేర్ల సంఖ్య చూస్తే 11 అవుతోంది. అంటే 11 మంది దర్శకుల పేర్లు వినిపించడం అంటే మాటలు కాదు. ఒకవేళ ఆ అందరితో సినిమాలు చేసినా సింపుల్ గా 20యేళ్లు అవుతోంది. ఈ 20యేళ్లలో ఎంతమంది దర్శకులు ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవుతారు అనేది కూడా చూడాలి. ప్రస్తుతం వినిపిస్తోన్న దర్శకుల పేరు అయితే ఇమ్మీడియెట్ గా లోకేష్ కనకరాజ్. అతను ఈ మూవీ చేయబోతున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిందని వినిపిస్తోంది. ఆ తర్వాత బసిల్ జోసెఫ్ పేరు బలంగా వినిపిస్తోంది. అతను ఓ సూపర్ హీరో కథతో ఐకన్ స్టార్ ను ఒప్పించాడు. అతని తర్వాతి మూవీ కూడా అదే అంటున్నారు. వీళ్లు కాకుండా ఇంకా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లు అయితే మనలో చాలామందికి నమ్మకం కూడా లేదు.

నెల్సన్ దిలీప్ కుమార్, ప్రశాంత్ నీల్, సంజయ్ లీలా భన్సాలీ, సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శ్రీను, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, వేణు శ్రీరామ్.. ఇన్ని పేర్లు వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ తర్వాతి చేయబోయే సినిమాల దర్శకులవి. ఇంతమందితో సినిమా అనేది అసలు పాయింటే కాదు. అదే టైమ్ లో అతను కోలీవుడ్ దర్శకులతో ఎక్కువగా అటాచ్ అయి ఉన్నాడు అనే పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు బోయపాటితో మూవీ అంటున్నారు. బట్ ఆల్మోస్ట్ అతనితో కటీఫ్ అయిపోయింది. కొరటాల శివతో కూడా ఆగిపోయినట్టే. వేణు శ్రీరామ్ గురించి ఊసులోనే లేడు. సంజయ్ లీలాతో అంటే ఒక అవకాశం ఉండేలా ఉంది. నెల్సన్, సందీప్ రెడ్డిల మూవీ గురించి కూడా కాస్త ఆలోచించేలా ఉన్నారు. మొత్తంగా ఇండియాలో ఏ హీరో కూడా ఇన్ని మూవీస్ లైనప్ లో ఉన్నాయి అని చెప్పలేదు. అల్లు అర్జున్ కు కూడా ఆ విషయం తెలియదు. బట్ ఒక స్టార్ హీరోతో ఇంతమంది దర్శకుల పేర్లు వినిపించడం కూడా ఇండియాలో మొదటి సారే అనుకోవచ్చు.

Tags:    

Similar News