Sai Durga Tej : సాయి దుర్గా తేజ్ నెక్ట్స్ మూవీ ఏంటీ..?

Update: 2026-02-09 12:50 GMT

సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న సినిమా అని టాక్. ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో బాగా ఆకట్టుకున్నాడు సాయి దుర్గా తేజ్. నిజానికి ఈ మూవీ గతేడాది దసరాకే విడుదల చేస్తాం అని చెప్పారు. బట్ ఈ టైమ్ కు రిలీజ్ కాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా అయిపోయింది. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తయిందనీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది అని చెబుతున్నారు. ఆ కారణంగానే సాయి దుర్గా తేజ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు.

బాహుబలి మూవీతో బాగా ఫేమ్ అయిన ఆర్టిస్ట్ తేజా కాకుమాని దర్శకుడుగానూ ఆకట్టుకున్నాడు. అతను సేవ్ ది టైగర్స్ అనే సిరీస్ తో మెప్పించాడు. ఇది ఓటిటిలో బాగా హిట్ అయిన సిరీస్. అలాంటి తేజా సినిమా కూడా చేయబోతున్నాడు. ఆ మూవీలోనే సాయి దుర్గా తేజ్ హీరోగా నటించబోతున్నాడు అని టాక్. తేజా చెప్పిన కథ సాయి దుర్గా తేజ్ కి బాగా నచ్చిందట. అందుకే అతనితో మూవీ చేయబోతున్నట్టు టాక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ప్రకటించబోతున్నారు. మరి ఎలాంటి కంటెంట్ తో సాయి దుర్గా తేజ్ .. తేజా కాకుమానితో రాబోతున్నాడు అనేది చూడాలి. 

Tags:    

Similar News