సాయి దుర్గా తేజ్.. చాలాకాలం అయింది అతన్నుంచి సినిమా వచ్చి.2023లో విరూపాక్షతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. అదే యేడాది పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో.. పెద్దగా కలిసి రాలేదు. అప్పటి నుంచి ఓ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా జగపతిబాబు, శ్రీకాంత్, అనన్య నాగళ్ల, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో ఈ చిత్రంతో కే.పి రోహిత్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో బిగ్ కాన్వాస్ తో రూపొందుతోన్న మూవీ అని అడపా దడపా వచ్చిన అప్డేట్స్ ను బట్టి అర్థం అయింది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేస్తాం అని అందరికంటే ముందుగా ప్రకటించింది వీళ్లే. కానీ ఇప్పుడా డేట్ కు వచ్చే పరిస్థితి లేదు.
సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓ.జి మూవీ విడుదలవుతోంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. చాలా ఆలస్యం అయిన ఈ మూవీ షూటింగ్ ను రీసెంట్ గానే పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. దీంతో రిలీజ్ డేట్ పై ఇక ఏ అనుమానాలూ అక్కర్లేదు. అదే డేట్ కు వస్తుందనుకున్న అఖండ 2 కూడా వాయిదా పడింది. వీళ్లు డిసెంబర్ 18 అంటూ కొత్త డేట్ చూసుకున్నారు. సో.. పవన్ కళ్యాణ్ ఓ.జి పై సంబరాల ఏటిగట్టు వేయలేరు. మామా అల్లుళ్లు కాబట్టి. పోనీ కొత్త డేట్ గా నెక్ట్స్ వీక్ కు వద్దాం అనుకుంటే అక్టోబర్ 2న కాంతార-1 ఉంది. కాంతార పై భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి.. ఈ మూవీపై ప్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను తట్టుకుని సాయి దుర్గా తేజ్ నిలవడం కష్టమే. పోనీ దీపావళి అనుకుంటే ఆ డేట్ కూ తెలుగుతో పాటు కొన్ని తమిళ్ సినిమాలు ఆల్రెడీ కర్చీఫ్ వేసి ఉన్నాయి. సో.. సంబరాల ఏటిగట్టు రిలీజ్ డేట్ తెగడం అంత సులువేం కాదు. మరి ఈ మూవీ సెప్టెంబర్ 25కే ఫిక్స్ అవుతుందా లేక కొత్త డేట్ కు వెళుతుందా అనేది చూడాలి.