Sai Pallavi : బర్త్‌డే బ్యూటీ మరో సర్‌ప్రైజ్... కమల్ తో సినిమా..!
Sai Pallavi : అభిమానులకి మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది బర్త్‌డే బ్యూటీ సాయిపల్లవి..;
Sai Pallavi : అభిమానులకి మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది బర్త్‌డే బ్యూటీ సాయిపల్లవి.. కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ ఐన 'రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్స్' లో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమాని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే... ఈ మూవీకీ టైటిల్‌గా 'ఎస్‌కే-21' అని టైటిల్ పెట్టారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని ఫైనల్ చేశారు.. ఈ విషయాన్ని సాయిపల్లవి స్వయంగా వెల్లడించింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, సొనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, టర్‌మెరిక్ మీడియా కలసి నిర్మించనున్నాయి.
దేశభక్తి కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా స్కోప్ ఉండగా, రష్మికని తీసుకునట్టుగా తెలుస్తోంది. హారీస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. అటు ఈ రోజు బర్త్‌డే సందర్భంగా సాయిపల్లవి 'గార్గి' అనే ఓ కొత్త సినిమాలో నటిస్తున్నట్టుగా వెల్లడించింది.