Saiee Manjrekar : డాడీతో కలిసి పని చేస్త : సయూ మంజ్రేకర్

Update: 2024-08-08 05:15 GMT

‘గని' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ సయూ మంజ్రేకర్ ( Saiee Manjrekar ). ఈ మూవీ ఆశించినంతగా ఆడకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి. దీంతో బాలీవుడ్లోకి వెళ్లింది ఈ బ్యూటీ. అక్కడ కూడా తగినన్ని చాన్సెస్ రాలేదు. దీంతో తన తండ్రి, డైరెక్టర్, బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ తో కలిసి పని చేస్తానని తెలిపింది. మహేశ్ మంజ్రేకర్ వారసురాలిగా తెరంగేట్రం చేసి బ్లాక్ బస్టర్ మూవీ `దబాంగ్ 3' తో నటించినా ఆ తరువాత ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. 'మేజర్', 'స్కంద'లాంటి సినిమాలు చేసింది. వీటిలో ఒక్క మేజర్ తప్ప మిగిలినవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. రీసెంట్ గా రిలీజైన 'అరోన్ మెన్ కహాన్ ధమ్' మూవీ పై సయూ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో నిరాశ చెందింది. దీంతో బిడ్డ కోసం మహేశ్ మంజ్రేకర్ మళ్లీ కెమెరా పడతారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. వచ్చే ఏడాది వీరిద్దరి కాంబోలో మూవీ రానుందని సమాచారం. తన తండ్రితో నైనా సయూ మంజ్రేకర్ దశ, దిశ తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News