Sharwanand : శర్వానంద్ కు జోడీగా సాక్షి వైద్య

Update: 2024-08-09 12:06 GMT

గత ఏడాది ఏజెంట్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ సాక్షి వైద్య. మొదటి సినిమానే పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాగా లక్ కలిసి రాకపోవడంతో డిజాస్టర్ అయిపోయింది. తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడీగా గాండీవదారి అర్జున చిత్రంలో నటించినా పెద్దగా కలిసి రాలేదు. ఈ మూవీ వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఆమెపై పెద్దగా అటెన్షన్ క్రియేట్ కాలేదు. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా సాక్షి వైద్య చాన్స్ అందుకుంది. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రాలేదు. ఇదే తరుణంలో సాక్షికి మరో ఆఫర్ వచ్చింది. అదేంటంటే యంగ్ హీరో శర్వానంద్ కి జోడీగా ఆమె నెక్స్ట్ మూవీలో నటించబోతోంది. రామ్ అబ్బరాజు డైరెక్టన్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాక్షి నటించనుంది. సామజవరగమన మూవీతో దర్శకుడిగా పరిచయమైన రామ్ అబ్బరాజు సక్సెస్ అందుకున్నారు. చాలా గ్యాప్ తీసుకొని ఆయన రెండో సినిమాని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ తాజాగా స్టార్ట్ అయ్యిందంట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంయుక్త మీనన్ కూడా ఈ మూవీలో ఒక హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టు 12న సాక్షి షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. శర్వానంద్ ఆమెకి ఎంత వరకు బ్రేక్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ హిట్ అయితే సాక్షికి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగే చాన్స్ ఉంది.

Tags:    

Similar News