బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు సల్మాన్ ఖాన్. ఈ ఏజ్ లో కూడా వరుసగా మూవీస్ చేస్తున్నాడు. కాకపోతే ఈ మధ్య ఆ స్థాయిలో విజయాలు రావడంలేదు. త్వరలోనే మాతృభూమి అనే మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీపైనా మరీ అంత గొప్ప అంచనాలైతే లేవు. ఈ మూవీ తర్వాత వరుసగా తెలుగు నిర్మాతలు, దర్శకులతో హిందీలో మూవీస్ చేయబోతున్నాడు. ఆ రకంగా ఇప్పటి ట్రెండ్ ను పట్టుకుంటాడేమో అనిపించేలా ఉన్నాడు.
సల్మాన్ ఖాన్ తో మొదటగా సినిమా చేయబోతోంది దిల్ రాజు. దిల్ రాజు.. సల్మాన్ తో మూవీ చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. అది ఇన్నాళ్లకు తీరింది. ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి. వంశీ ఇంతకు ముందు కూడా తమిళ్ హీరో విజయ్ తో వారిసు అనే మూవీ చేశాడు. తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ లో సల్మాన్ కు సెట్ అయ్యేలా ఓ అద్భుతమైన కథతో వచ్చాడు. కథ వినగానే వెంటనే ఓకే చెప్పాడు సల్మాన్. దీంతో పాటు ఈ మూవీకి ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటంటే.. హీరోయిన్ గా నయనతార చేయబోతోంది. తను కూడా కథ వినగానే ఇమ్మీడియెట్ గా యస్ చెప్పింది. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ లోనే స్టార్ట్ కాబోతోంది. అంటే చాలా వేగంగా చిత్రీకరణ చేయాలని ప్లాన్ చేశారట.
ఇక సల్మాన్ తో చేయబోతోన్న నెక్ట్స్ మూవీ మైత్రీ మూవీ మేకర్స్. మైత్రీ వాళ్లు ఆల్రెడీ హిందీలో అదరగొడుతున్నారు. ఆ కారణంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ చిత్రానికి కూడా హిందీలో ఫేమ్ అయిన తెలుగు డైరెక్టర్స్ అయిన రాజ్ నిడుమోరు, కృష్ణ డి.కే చేస్తున్నాడు. రాజ్ - డికే ద్వయం పేరుతో ఫ్యామిలీ మేన్ సిరీస్ తో బాగా ఆకట్టుకుంది ఈ ద్వయం. ఈ ఇద్దరితో సల్మాన్ ఖాన్ సినిమా చేయబోతున్నాడు. హీరోయిన్ గా రాజ్ వైఫ్ అయిన సమంత. యస్.. సమంతనే సల్మాన్ తో హీరోయిన్ గా నటించబోతోంది. మొత్తంగా తెలుగు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తో సల్మాన్ వరుస మూవీస్ చేయబోతున్నాడు. మరి వీటిలో ఏది పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.