సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా సికందర్. తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ రూపొందించిన సినిమా ఇది.ఈ నెల 30న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా సికందర్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే మురుగదాస్ స్టైల్ లోనే సాగే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. దీంతో పాటు అతని శైలిలో ఓ మెసేజ్ కూడా ఉండేలా ఉంది. రాజ్ కోట్ లో ఉండే ఓ సాధారణ వ్యక్తి.. అందరిక సాయం చేస్తుంటాడు. అతన్ని చుట్టుపక్కల మనుషులు రాజా సాబ్, సంజయ్ సాబ్, సికందర్ సాబ్ అని పిలుస్తుంటారు.అలాంటి వ్యక్తి తన టీమ్ తో ముంబైలో అడుగుపెట్టి ఓ పెద్ద రాజకీయ నాయకుడిని ఢీ కొట్టాల్సి వస్తుంది. మరి ఎందుకు పొలిటీషియన్ తో ప్రాబ్లమ్ వచ్చింది. ముంబై వచ్చిన తర్వాత వీరి టీమ్ ఏం చేసింది.. అనే కోణంలో కథనం సాగేలా ఉంది.
అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఆడియన్స్ ఏ తరహా మాస్ కంటెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారో ఆ తరహాలోనే ఊరమాస్ ఫైట్స్ తో మంచి రక్తపాతంతో మసాలా నిండిన యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ అంతా కనిపిస్తోంది. ఓ రకంగా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి మూవీ అనుకోవచ్చు. కాకపోతే ఇది సౌత్ ఆడియన్స్ కు ఆల్రెడీ తెలిసిన అనేక కథల మిక్స్ లా ఉంది. అయినా ప్రస్తుతం స్ట్రగులింగ్ లో ఉన్న సల్మాన్ ఖాన్ కు సికందర్ మంచి హిట్ గా నిలిచే అవకాశాలు కనిస్తున్నాయి. కాకపోతే అతను వీకెండ్ లో కాకుండా ఈద్ పండగ కోసం అని ఆదివారం వస్తున్నాడు. మరి అది ఏమంత తెలివైన నిర్ణయం అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.