రెండేండ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైపోయిన సమంతా ఎట్టకేలకు వెండితెర మీద కనిపించబోతోంది. ఆమె ప్రొడక్షన్ లో నిర్మాణమైన మొదటి సినిమా శుభం మే 9 విడుదల కానుంది. ట్రాలాలా బ్యానర్ పై ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో దాదాపు అందరూ కొత్తగా వాళ్లతో వస్తోన్న ఈ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ లో వెరైటీ పాయింట్ తీసుకున్నారు. తాజాగా శుభం సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో శుభం కథ ఏంటో సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. ఊర్లోని మహిళలంతా రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే సీరియలు అడిక్ట్ అవుతారు.. ఆ సీరియల్ చూస్తూ దెయ్యాల్లా మారిపోతారు. ఇక ఇంట్లో మగాళ్లకి రక్షణ కరువు అవుతుంది. ఆ తరువాత ఓ మాతగా సమంత కనిపిస్తుంది. మరి ఈ మాత ఏం చేస్తుంది? అసలు మహిళలంతా అలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తారు? అన్న పాయింట్లే సినిమాలో చూపించబోతోన్నారని అర్థం అవుతోంది. మరోవైపు ఈమూవీలో సాయిస్పెషల్ అప్పియరెన్స్ అదిరిపోయేలా ఉంది. అయితే ట్రైలర్లో మాత్రం డైలాగ్స్ లేకుండా సైగలతోనే ఆకట్టుకుంది.