Samantha: చైతో కలిసి ఉన్న ఇంటిని మళ్లీ కొనుగోలు చేసిన సామ్..
Samantha: కొందరికి కొన్ని సెంటిమెంట్లు.. ఇల్లు, కారు, మరొకటి, ఎంతో ఇష్టపడి కొనుక్కుంటారు.. దాని మీద అభిమానం పెంచుకుంటారు..;
Samantha: కొందరికి కొన్ని సెంటిమెంట్లు.. ఇల్లు, కారు, మరొకటి, ఎంతో ఇష్టపడి కొనుక్కుంటారు.. దాని మీద అభిమానం పెంచుకుంటారు.. ఆ ఇల్లు కొన్న తరువాత ఆర్ధికంగా కలిసొచ్చింది అని అనుకునేవాళ్లు కూడా ఉంటారు.. అయితే సమంత, నాగచైతన్య కూడా అదే ఇంట్లో కాపురం పెట్టారు.. ఇద్దరూ కలిసి ఆ ఇంటికి కావలసిన ఏర్పాట్లన్నీ తమ అభిరుచికి అనుకూలంగా మలుచుకున్నారు.
అంతా సాఫీగా జరిగిపోతుందనుకుంటున్న సమయంలోనే అవాంతరాలు, కుటుంబ కలహాలు, విడిపోవడాలు జరిగిపోయాయి. కలిసొచ్చింది అనుకున్న ఇంటిని అమ్మేసి ఎవరి దారి వారు చూసుకున్నారు.. చైతన్య మరో ఇంటిని కొనుగోలు చేసి దాంట్లో నివసిస్తున్నా, సమంతకు మాత్రం చైతో కలిసి ఉన్న ఇల్లే నచ్చిందట.. ఆ ఇంటినే మరింత ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసింది.
ఇప్పుడు తన తల్లితో కలిసి సమంత అదే ఇంట్లో ఉంటున్నట్టు నటుడు మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్లోని ఒక ఫ్లాట్ సామ్ కొనుగోలు చేసి ఉంటున్నట్లు చెప్పారు ఆయన. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఎందుకు విడిపోయారు తెలియదు అని మురళీ మోహన్ అన్నారు.