Samantha Ruth Prabhu: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. 'ప్రెగ్నెంట్‌‌‌‌గా సామ్'..!

Samantha Ruth Prabhu: యశోద చిత్రం కూడా ఓ ప్రయోగాన్ని చేయనుంది సామ్.

Update: 2022-01-19 05:05 GMT

Samantha Ruth Prabhu: సమంత.. ప్రస్తుతం తన ఆలోచనలు, పద్ధతులు కేవలం తన కెరీర్‌కు మాత్రమే ఎలా ప్లస్ అవుతాయా అన్నదానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందుకే తన సినిమా సెలక్షన్ స్టైలే మారిపోయింది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలకే ప్రస్తుతం సమంత ఫస్ట్ ప్రయారిటీ. తాజాగా బోల్డ్ సినిమాలు కూడా చేయడానికి రెడీ అయిన సమంత.. తన అప్‌కమింగ్ చిత్రం 'యశోద'లో ముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

ఒక హీరోయిన్ అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు చేయగలగాలి. వాటితో వందశాతం ప్రేక్షకులను మెప్పించగలగాలి. ఈ ఫార్ములానే సమంత ఎప్పటినుండో ఫాలో అవుతోంది. అందుకే ఇప్పుడిప్పుడే బోల్డ్ కథలకు కూడా ఓకే చెప్తేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో అయితే ఏకంగా విలన్‌గా కూడా కనిపించింది. మరోసారి యశోద చిత్రం కూడా ఓ ప్రయోగాన్ని చేయనుంది సామ్.

సమంత చేస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో యశోద కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో సమంత ఓ ప్రెగ్నెంట్ లేడీగా కనిపించనుందట. ఇంతకు ముందు కూడా మనం లాంటి చిత్రాల్లో కాపేపు తల్లిగా కనిపించిన సమంత.. ఈసారి సినిమా మొత్తం దాదాపు ప్రెగ్నెంట్‌గానే కనిపించనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ నిజమో కాదో తెలియాలంటే యశోద టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Tags:    

Similar News