Samantha Ruth Prabhu: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీపై సమంత ఆసక్తికర పోస్ట్..

Samantha Ruth Prabhu: సమంత.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురించి ఓ స్టోరీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Update: 2022-02-28 13:45 GMT

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇతర దేశ ప్రజలు కూడా ఇబ్బందులు పడడం వల్ల దీనిపై సామాన్యుల దృష్టి కూడా పడింది. రష్యా చర్యలకు ఉక్రెయిన్ సతమతమవుతోంది కాబట్టి చాలామంది ఆ దేశ మంచి గురించి కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో సమంత కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీపై ప్రశంసలను కురిపించారు.

సినీ విషయాల గురించే కాదు.. సామాజిక అంశాలు, తనను కదిలించే పలు విషయాలపై కూడా సోషల్ మీడియాలో స్పందించడం సమంతకు అలవాటు. అయితే ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి స్పందించగా.. తాజాగా సమంత కూడా స్పందించింది. అంతే కాకుండా ఈ సమయంలో తన దేశం కోసం బలంగా నిలబడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ గురించి ఓ స్టోరీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

రష్యా.. ఉక్రెయిన్‌ను నాలుగువైపుల నుండి దాడిచేస్తోంది. అంతే కాకుండా కుదిరినంత ల్యాండ్‌ను రష్యాలో కలిపేసుకునే ప్రయత్నం చేస్తోంది. అయినా తన ప్రజలకు ధైర్యం చెప్తూ.. శత్రువులకు వెనకడుగు వేయకుండా నిలబడిన అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీను ప్రజలతో పాటు మీడియా కూడా ప్రశంసిస్తోంది. అలా ఓ వెబ్‌సైట్ జెలెన్స్కీ గురించి రాసిన ఆర్టికల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సమంత.

'వోలోడిమిర్ జెలెన్స్కీ కోసం దేవుడిని వేడుకుంటున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడి ధైర్యం గుర్తుపెట్టుకునే విధంగా ఉంది' అని ఫ్రాంక్లిన్ ఫోయెర్ అనే ఓ ఫారిన్ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్‌ను సమంత షేర్ చేసింది. దీని బట్టి తాను కూడా ఉక్రెయిన్ కోసం, అక్కడి ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పకనే చెప్పింది.

Tags:    

Similar News