Samantha Ruth Prabhu: సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో ఏదో తెలియని బాధ..
Samantha Ruth Prabhu: సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను, ఇష్టాలను తమ ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి సోషల్ మీడియా ఒక అస్త్రం.;
Samantha Ruth Prabhu: సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను, ఇష్టాలను తమ ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి సోషల్ మీడియా ఒక అస్త్రం. ఎప్పటికప్పుడు వారికి అనిపించింది ఫాలోవర్స్‌తో పంచుకుంటూ.. వారి అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో అందరికంటే ముందుంటుంది హీరోయిన్ సమంత. ఎప్పటినుండైనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఈ మధ్య తనకు నచ్చిన లైఫ్ కోట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పెడుతూ అందరినీ మోటివేట్ చేస్తోంది.
నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన రెండో రోజు నుండే సమంత ఇలాంటి కోట్స్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం మొదలుపెట్టింది. ఇటీవల అమ్మాయికి పెళ్లి ముఖ్యం కాదు.. చదువు ముఖ్యం అంటూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తాజాగా మనిషి ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాల గురించి రాబర్ట్ మైక్ చెప్పిన విషయాన్ని తన స్టోరీలో షేర్ చేసింది.
'మనిషి ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలను బట్టే వారి క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఎంత ఎక్కువ ఒత్తిడి ఉంటే.. అంత లోతుగా ఆలోచిస్తాం. అంత నిజాయితిగా క్యారెక్టర్ కూడా బయటపడుతుంది' అని సమంత పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తుంటే తనలో ఏదో తెలియని బాధ ఉందంటున్నారు నెటిజన్లు.