Samantha Ruth Prabhu: ప్రేమకైనా.. ద్వేషానికైనా.. నేను దూరం: సమంత

Samantha Ruth Prabhu: ప్రేమ, ద్వేషం గురించి ఎదురైన ప్రశ్నకు సామ్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

Update: 2022-05-01 10:50 GMT

Samantha Ruth Prabhu: సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషలు చుట్టేస్తోంది. అయితే సమంత ఎంత బిజీగా ఉన్నా.. తన ఫాలోవర్స్‌తో ముచ్చటించడం మాత్రం మర్చిపోదు. అందుకే ఇటీవల ట్విటర్‌లో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది సామ్. అయితే ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమంత ఇచ్చిన సమాధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ప్రస్తుతం సమంత తాను నటించిన 'కాతువాకుల రెండు కాదల్' మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అంతే కాకుండా మరోవైపు వీడీ 11 చిత్రం కోసం కశ్మీర్‌కు వెళ్లింది. అక్కడే సమంత పుట్టినరోజును గ్రాండ్‌గా చేసింది మూవీ టీమ్. ఇదిలా ఉండగా ఇటీవల తన ట్విటర్ ఫాలోవర్స్‌తో చిట్ చాట్‌ను ఏర్పాటు చేసింది సామ్. అందుకే ప్రేమ, ద్వేషం గురించి ఎదురైన ప్రశ్నకు సామ్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

'ఒకేసారి ఎక్కువ ప్రేమ, ద్వేషం ఎదురైనప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు' అని ఓ ఫ్యాన్ నుండి సమంతకు ప్రశ్న ఎదురయ్యింది. దీనికి సమాధానం 'నేను ప్రేమకు, ద్వేషానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను.' అని ట్వీట్ చేసింది సమంత. తను ఈ సమాధానం దేనిని ఉద్దేశించి చెప్పిందో అంటూ తన ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసేసుకుంటున్నారు.

Tags:    

Similar News