Samantha: సామ్ ఫుల్ బిజీ.. 'ఆహా'లోకి మరోసారి..
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు వరుస ఆఫర్లతో బిజీగా మారింది.;
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు వరుస ఆఫర్లతో బిజీగా మారింది. ఫ్యామిలి మ్యాన్ 2తో వెబ్ సిరీస్‌లోకీ అడుగు పెట్టి సక్సెస్ అయ్యింది. ఓటీటీ ఫ్లాట్‌ఫాం 'ఆహా' లో సామ్ జామ్ కార్యక్రమం మొదలు పెట్టి సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది. ఇప్పుడు మరో సారి ఆహా టీమ్ సమంతను సంప్రదించిందట.
సామ్ జామ్ సీజన్ 2 కోసం మరోసారి రంగంలోకి దిగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనుంది ఆహా టీమ్. కాగా, సమంత నటించిన శాకుంతలం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.