Vijay Devarakonda : విజయ్ దూకుడు తగ్గడం లేదు

Update: 2026-03-09 08:11 GMT

విజయ్ దేవరకొండ మూవీస్ విషయంలో ప్లానింగ్ సెట్ కావడం లేదు. ఎక్కువగా ఫ్లాపులే వస్తున్నాయి. అయినా అతని మూవీస్ మాత్రం ఆగడం లేదు. పైగా ప్యాన్ ఇండియా స్థాయిలో మెప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ప్రస్తుతం అదే ప్యాన్ ఇండియా స్థాయిలో మూవీ అంటూ రణబాలి రూపొందుతోంది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా ఇది. దీంతో పాటు రౌడీ జనార్ధన్ అనే మూవీ కూడా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకుడు. ఈ రెండు సినిమాలపై రౌడీ హీరో చాలా నమ్మకం పెట్టుకున్నాడు. పైగా రణబాలి మూవీలో పెళ్లైన రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తోంది. రష్మిక మూవీ అంటే మాగ్జిమం హిట్ అనే టాక్ కూడా ఉంది.

ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు టాక్. హాయ్ నాన్న మూవీ ఫేమ్ శౌర్యూ ఈ చిత్రాన్ని దర్శకత్వం చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. శౌర్యు హాయ్ నాన్న తర్వాత విభిన్నమైన కథలు పట్టుకుని చాలామంది హీరోలతో ప్రయత్నించాడు. బట్ ఏదీ వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా విజయ్ దేవరకొండ వద్ద ఆగిపోయాడు. అతను ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టు టాక్. ఈ మధ్యే ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన కర్ణాటకకు చెందిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీ నిర్మించబోతోంది. వీరు విజయ్ హీరోగా ప్రొడ్యూస్ చేసిన జన నాయగన్ తో అరంగేట్రం చేశారు. చిరంజీవి, బాబీ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీకి కూడా ఇదే నిర్మాణ సంస్థ చేయబోతోంది. మొత్తంగా విజయ్ దేవరకొండ మూవీస్ పోతున్నా అతని దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఈ దూకుడులో వరుసగా హిట్స్ పడితే అంతే చాలు. అతని రేంజ్ మారిపోతుంది అంతే. 

Tags:    

Similar News