కలిసి సినిమాలు చేయలేదు కానీ.. నాగ చైతన్య కంటే ముందు నుంచే రానా, సమంత మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. మరి ఫ్రెండ్స్ అంటే సెటైర్స్ కూడా కామన్ గా ఉంటాయి కదా.. అయితే సమంత వేసిన సెటైర్ మాత్రం అందరికీ బలే నచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. రీసెంట్ గా ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ ను రానా హోస్ట్ చేశాడు. రానా హోస్టింగ్ అంటే బ్లాస్టింగ్ గా ఉంటుందని కూడా అందరికీ తెలుసు. తేజ సజ్జాతో కలిసి చాలా నవ్వులు పంచాడీ టాల్ మేన్.
ఇక అదే వేదికపై సమంత వచ్చినప్పుడు రానా ఆమెను ‘తెలుగులో సినిమాలు ఎందుకు చేయడం లేదు’ అని టీజింగ్ గా అడిగాడు. దానికి సమంత కూడా ‘నువ్వూ చేయడం లేదు ఎందుకు’ అని అడిగింది. దీంతో రానా.. నిజం చెప్పాలంటే ఎవరూ అడగట్లేదు అన్నాడు. దానికి శామ్ కూడా నా పరిస్థితి కూడా అంతే.. కాకపోతే ఇప్పుడు నేను సినిమా చేయాలంటే నరసింహ నాయుడు రేంజ్ లో ఉండాలి.. ‘‘రానా నాయుడు’’ లాంటివి చేయలేను కదా అని సెటైర్ వేసింది.
రానా నాయుడు అంటే వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్. కాస్త అడల్ట్ డోస్ ఎక్కువగా కనిపించే సిరీస్ ఇది. వెంకీ తన ఇమేజ్ కు భిన్నంగా అనేక బూతులు మాట్లాడతాడీ సిరీస్ లో. రానా అయితే ఇంటిమేట్ సీన్స్ కూడా చేసేశాడు. అందుకే తను సినిమా చేయాలంటే ఏది పడితే అది కాదు.. ఓ మంచి కమర్షియల్ సినిమా అయి ఉండాలి అన్నట్టుగా సమంత ఇచ్చిన కౌంటర్ కు హాలంతా నవ్వులతో నిండిపోయింది.