Samyukta Menon: 'విరూపాక్ష' టీమ్‌పై సంయుక్త ఫైర్..

Samyukta Menon: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో అభిమానులను అలరించబోతున్నాడు.;

Update: 2023-03-23 06:58 GMT

Samyukta Menon: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో అభిమానులను అలరించబోతున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా మూవీ నిర్మాతలు ధరమ్ తేజ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కానీ, ప్రధాన నటి సంయుక్త మీనన్ పోస్టర్‌ను బహిర్గతం చేయకపోవడంతో ఆమె కొంత నిరాశ చెందారు. సోషల్ మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు. ఆమె పోస్ట్‌లో ఇలా పేర్కొంది.. "నేను నా నిరాశను వ్యక్తం చేయడానికి ముందు, #విరూపాక్షతో నా ప్రయాణం అద్భుతం. అలాంటి అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో పని చేసే అవకాశాన్ని పొందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే నా క్యారెక్టర్ పోస్టర్‌ను ఉగాదికి విడుదల చేస్తామని టీమ్ నాకు హామీ ఇచ్చింది. కానీ ఒక్క హీరో చిత్రాన్ని మాత్రమే విడుదల చేశారు. ఈ విషయం నన్ను చాలా నిరాశకు గురిచేసింది అని ట్వీట్ చేసింది. దానికి విరూపాక్ష టీమ్ స్పందిస్తూ.. త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. సాయి ధరమ్ తేజ్ యొక్క కొత్త పోస్టర్.. క్లాస్సి లుక్‌లో స్పోర్టింగ్‌గా కనిపించాడు. విరూపాక్ష బృందం అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ కొత్త సంవత్సరం మీకు సకల శ్రేయస్సు, సంతోషం మరియు మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలి" అని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇంతకుముందు విడుదల చేసిన టీజర్‌లో గ్రామ ప్రజలు మూఢనమ్మకాల గురించి చర్చించుకోవడంతో ప్రారంభమవుతుంది. కొన్ని అనుమానాస్పద మరణాలు కూడా భయాన్ని తీవ్రతరం చేస్తాయి. సమస్యని వెంటాడి పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు వారు 'విరూపాక్ష' పుస్తకం గురించి ఆలోచిస్తారు. అప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నానికి పూనుకుంటాడు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. విరూపాక్ష చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్ నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ ప్రధాన భూమికను పోషించింది. ఇక ఈ చిత్రం 21 ఏప్రిల్, 2023న థియేటర్లలో సందడి చేయనుంది. 

Tags:    

Similar News