Vikranth : ఈ జెనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా ‘సంతాన ప్రాప్తిరస్తు’

Update: 2025-03-05 10:45 GMT

కంటెంట్ బేస్డ్ కథలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. కాకపోతే సరైన కథనం కూడా ఉండాలి. ఈ రెండూ ఉన్నాయి అనిపించేలా కనిపిస్తోంది ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే మూవీ టీజర్. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను సందీప్ రెడ్డి వంగా విడుదల చేశాడు. విక్రాంత్, చాందిన చౌదరి జంటగా వెన్నెల కిశోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ టీజర్ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది. ప్రధానంగా ఈ జెనరేషన్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.

సాఫ్ట్ వేర్ జాబ్ చేసే ఓ కుర్రాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి గురించి అమ్మాయి ఫ్యామిలీకి తెలియదు. తెలిసిన తర్వాత కుర్రాడితో వాదన పెట్టుకుంటాడు ఆమె తండ్రి. తన కూతురును తనతో తీసుకువెళతా అని శపథం చేస్తాడు. ఒక వంద రోజుల్లో తన కూతురును తీసుకువెళతా అంటాడు. ఆ లోగా ఆమెను ప్రెగ్నెంట్ చేస్తే ఇంకేం చేయలేడు అని ఆ సాఫ్ట్ వేరే ప్రయత్నిస్తాడు. కానీ కుర్రాడిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని డాక్టర్లు చెబుతారు. ఆ కౌంట్ పెంచుకుని 100 రోజుల్లోగా భార్యను ప్రెగ్నెంట్ చేయాలని నానా తంటాలు పడుతుంటాడు. అతను అనుకున్నది సాధించాడా.. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య ఎలాంటి ఎమోషన్స్ రేకెత్తాయి.. అనే కంటెంట్ తో మంచి వినోదం కూడా మేళవించిన కథలా ఉంది సంతాన ప్రాప్తిరస్తు. కొన్నాళ్లుగా ఒక్కో పోస్టర్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ తోనూ ఆకట్టున్నారు వీళ్లు. టీజర్ చూస్తే ప్రామిసింగ్ గా ఉందనే చెప్పాలి.

Full View

Tags:    

Similar News