Nani and SJ Surya : సరిపోదా శనివారంకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయా

Update: 2024-08-30 04:51 GMT

నాని, ఎస్.జే. సూర్య నటించిన మూవీ సరిపోదా శనివారం. ఈ గురువారం విడుదలైన ఈ మూవీకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. రివ్యూస్, రేటింగ్స్ కూడా బావున్నాయి. కాకపోతే గురువారం వర్కింగ్ డే. దీంతో ఇది ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుందని చాలామంది భావించారు. అది కొంత వరకూ నిజమే కానీ.. మూవీకి ముందు నుంచి ఉన్న పాజిటివ్ టాక్ తో పాటు కాంబినేషన్ క్రేజ్ వల్ల మార్నింగ్ షోస్ చాలా చోట్ల చాలా బావున్నాయి. టాక్ బయటకు వచ్చిన తర్వాత ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ హౌస్ ఫుల్ పడిపోయాయి. అంటే కంటెంట్ బావుంటే వర్కింగ్ డే అయినా ఫర్వాలేదు అని ఆడియన్స్ తేల్చేసినట్టే. ఈ రోజు నుంచి మరింత పుంజుకునే అవకాశం ఉంది. నాని ఇంతకు ముందెప్పుడూ కనిపించినంత ఫెరోషియస్ గా ఉన్నాడీ మూవీలో. అటు ఎస్.జే సూర్య విలన్ గా విశ్వరూపం చూపించాడు. హీరోయిన్ ప్రియాంక పాత్రనే సరిగా డిజైన్ చేయలేదు. తను సినిమా ఆసాంతం డల్ గానే కనిపిస్తుంది. బట్ మెయిన్ గేమ్ అంతా నాని, సూర్య మధ్య కాబట్టి.. వాళ్లిద్దరూ అదరగొట్టారు.

ఫస్ట్ డే సరిపోదా శనివారంకు నైజాంలో 2.30 కోట్ల 'షేర్' వచ్చింది. ఓ రకంగా ఇది గ్రేట్ స్టార్ట్ అని చెప్పాలి. మిగతా చోట్ల కూడా స్ట్రాంగ్ గానే ఉంది మూవీ. వైజాగ్, ఈస్ట్, గుంటూరు, కృష్ణా లాంటి ప్రాంతాల్లో మరింత బాగా పర్ఫార్మ్ చేస్తోందీ మూవీ. మొత్తంగా గత మూడు సినిమాలూ కంప్లీట్ సాఫ్ట్ గా రూపొందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ తనలోనూ ఓ ఊరమాస్ డైరెక్టర్ ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఏ మాటకామాటే.. జేక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచిందనే చెప్పాలి. ఊహించినంతగా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు మళ్లీ హిట్ కళ తెచ్చింది సరిపోదా శనివారం.

Tags:    

Similar News