Sarkaru Naukari: హీరోగా లాంచ్ అవుతోన్న సింగర్ సునీత తనయుడు

పోస్టర్ లో 'పెద్ద రోగం చిన్న ఉపాయం' అనే బాక్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది;

Update: 2023-07-01 08:59 GMT

సింగర్ సునీత తనయుడు నటిస్తోన్న 'సర్కార్ నౌకరీ' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందుకుగాను ఆవిడ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో చిత్ర యునిట్ కు అభినందనలు తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.  చిత్రం విజయవతం కావాలని అందరికీ మంచి పేరు రావాలని కోరింది. ఇందుకుగాను ఇన్ స్టా గ్రామ్ లో  పోస్ట్ చేసింది. "ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రేక్షకులతో పంచుకోవడం సంతోషం. మీ కలలను అందుకోవడానికి మీరు పడ్డ శ్రమ అనిర్వచనీయం. ఇది త్యాగానికి, అంకితభావానికి ప్రతీక. మీ అసాధారణ ప్రయాణాన్ని ప్రపంచం చూస్తోంది. మీకు ఎప్పటికీ మంచి జరగాలి " అని సునీత అన్నారు.




 


ఇప్పటికే ఈ సినిమాకు సర్కార్ నౌకరీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సునీత తనయుడు ఆకాష్ గోపరాజు నటిస్తోన్న ఈ సినిమాను గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ను గమనిస్తే.. 1980 కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ షర్ట్ వేసుకుని హీరో సైకిల్ ఎక్కిన హీరో కనబడుతాడు. పల్లెటూరి నేపథ్యంలో సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. పోస్టర్ లో 'పెద్ద రోగం చిన్న ఉపాయం' అనే బాక్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.  ఆకాష్ కు జోడీగా భావనా వళపండల్ నటిస్తోంది. ఈవిడకూ  ఇదే మొదటి సినిమా.


ప్రముఖ దర్శకులు కే.రాఘవేంద్రరావు ఆక్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తెరను పంచుకున్నారు. సంగీతం శాండిల్య అందిస్తుంగా.. గంగనమోని శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. 



Tags:    

Similar News