Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..!
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. మే12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..;
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వస్తోన్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.. మే12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా 5 షోలు వేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది.
వారం రోజుల పాటు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.50 పెంచుకునేందుకు అనుమతివ్వగా..ఏసీ సాధారణ థియేటర్‌లో రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. మే 12 నుంచి 18 వరకు అయిదు షోలకి అనుమతి ఇచ్చింది.
కాగా ఈ సినిమాలో మహేష్ కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ యాక్షన్, రొమాంటిక్ మరియు కామెడీ డ్రామాగా తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు.