Ramayana : సిఎమ్ కామెంట్స్ తో రామాయణం రిలీజ్ డేట్ పై సెర్చింగ్స్

Update: 2025-05-05 12:41 GMT

భారత ఇతిహాసాల్లో రామాయణానికి ఉన్న స్థానం మరి దేనికీ లేదు అంటారు. భారతం, భాగవతం ఉన్నా.. రామాయణంలోని విలువలు, భక్తి అందులో కనిపించవు అనేవారూ ఉన్నారు. అందుకే రామాయణ గాథ ఎన్నిసార్లె వెండితెరపై వచ్చినా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. ప్రభాస్ ఆదిపురుష్ క్వాలిటీ లేకపోయినా భారీ వసూళ్లు వచ్చాయి అంటే కారణం రామాయణంపై మనవారికి ఉన్న ప్రేమే అనేది కాదనలేని వాస్తవం. ఇక ఇప్పుడు బాలీవుడ్ నుంచే మరో రామాయణం రాబోతోంది.

రణ్ బీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. యశ్ నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడీ చిత్రానికి. రీసెంట్ గా మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రామాయణం గురించి ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ మూవీ సెట్స్ ను తను, పిఎమ్ మోదీ సందర్శించామని ఎంతో రియలిస్టిక్ గా, క్వాలిటీతో ఉన్నాయనీ.. ఈ చిత్రం నేటి తరానికి ఆదర్శాలను నింపాలని చెప్పాడు.

ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. రెండు భాగాలుగా రూపొందుతోన్న రామాయణ - పార్ట్ 1 ను 2026 దీపావళికి విడుదల చేయబోతున్నారు. రామాయణ - పార్ట్ 2 ను 2027 దీపావళికి విడుదల చేస్తాం అని చెప్పారు. ఆదిపురుష్ ఎఫెక్ట్ ఎంత ఉన్నా ఈ మూవీపై అంచనాలున్నాయి. అందుకు కారణం కాస్టింగ్ కూడా అని చెప్పాలి. ప్రధాన పాత్రల తర్వాత సన్నీడియోల్, కునాల్ కపూర్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నిజానికి ఈ మూవీ రిలీజ్ డేట్ గతేడాదే ప్రకటించారు. కాకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ కామెంట్స్ తర్వాత చాలామంది మరోసారి ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. అంటే ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆతృత ఆడియన్స్ లో కనిపిస్తోందనుకోవాలి. ఇక ఈ సెర్చింగ్స్ తో ఈ రామాయణ రిలీజ్ డేట్ హాట్ టాపిక్ గా మారింది.

 

Tags:    

Similar News