జానీ మాస్టర్ కు ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక ఆరోపణల కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి కోర్టు తిరస్కరించింది. నేషనల్ అవార్డు కోసం గతంలో ఐదు రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. అయితే అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడంతో మధ్యంతర బెయిల్ రద్దైంది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.