Shahrukh Khan's Zinda Banda: 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన పాట
సోషల్ మీడియాలో రికార్డు సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జిందా బందా;
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' లోని 'జిందా బందా' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ మూవీపై ఇప్పటికే ఉన్న అంచనాలను సైతం అమాంతం రెట్టింపు చేసింది. దీంతో అభిమానులలో ఈ మూవీపై రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల, మేకర్స్ ఈ చిత్రంలోని 'జిందా బందా' అనే మొదటి పాటను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో విధ్వంసం సృష్టించింది. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో 46 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఫీట్‌తో, ఈ పాట ఇప్పుడు 2023లో యూట్యూబ్‌లో ప్లే అయిన అతిపెద్ద పాటగా మారింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ విజయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో.. అభిమానులతో పంచుకుంది. ''ఇంటర్‌నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అందరి ప్రేమకు ధన్యవాదాలు’’ అని రాసుకువచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే, అభిమానులు దానిపై కామెంట్ చేయడం ప్రారంభించారు. '' అంతా బాగుంది కానీ అనిరుధ్ pls srk కోసం పాడవద్దు. అతని స్వరం షారుఖ్ కి సరిపోదు'' అని ఒక యూజర్ రిప్లై ఇవ్వగా.. ''ఇది షారుఖ్ ఖాన్ వరల్డ్. మనం దానిలో జీవిస్తున్నాము'' అని మరొకరు రాసుకువచ్చారు.
ఇక 'జిందా బందా' సాంగ్ విషయానికొస్తే.. ఇది హిందీ, తమిళం, తెలుగుతో సహా మూడు వేర్వేరు భాషలలో మేకర్స్ జూలై 31న విడుదల చేశారు. హిందీలో, ఈ పాటను జిందా బందా, తమిళంలో వందా ఎడమ, తెలుగులో దుమ్మే ధూళిపేలా అనే టైటిల్‌తో రూపొందించారు. సోషల్ మీడియా, ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో రిలీజ్ అయిన ఈ సాంగ్ కేవలం ఒక రోజులోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం చెప్పుకోదగిన విషయం.
సినిమా గురించి
'తేరి', 'మెర్సల్'తో సహా ప్రముఖ చిత్రాలకు దర్శకత్వం వహించిన అట్లీ కుమార్ 'జవాన్'కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె , నయనతార కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా సెప్టెంబర్ 11న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.