RC 15: చరణ్, శంకర్ సినిమాకు దిమ్మదిరిగే బడ్జెట్.. కేవలం పాటకు, ఫైట్‌కే అన్ని కోట్లా..!
RC 15: రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు.;
RC 15: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఏం చేసినా సెన్సేషన్‌గానే ఉంటుంది. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా.. ఎంత బడ్జెట్ అయినా వెనకాడకుండా సినిమాలు చేస్తాడంటూ శంకర్‌కు పేరుంది. అలాంటి డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానుల దృష్టంతా ఈ మూవీపైనే ఉండగా.. తాజాగా బయటికొచ్చిన ఓ అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ చూసిన వారంతా రామ్ చరణ్ యాక్టింగ్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కేవలం తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో, బాలీవుడ్‌లో కూడా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్‌ను సాధించింది. దీంతో శంకర్‌పై మరింత ప్రెజర్ పడింది. ఎలాగైనా రామ్ చరణ్‌తో శంకర్ చేయబోయే సినిమా అంచనాలకు మించినట్టుగా ఉండాలని అభిమానులు ఆశపడుతున్నారు.
శంకర్ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనకాడడని తెలిసిన విషయమే. రామ్ చరణ్‌తో శంకర్ తెరకెక్కించబోయే సినిమాను దిల్ రాజు నిర్మిస్తు్న్నాడు. అయితే ఈ సినిమాలో ఓ పాట కోసం రూ.10 కోట్లు, ఓ ఫైట్ కోసం రూ.10 కోట్లు శంకర్ ఖర్చు చేయనున్నాడన్న వార్త ఫిల్మ్ సర్కి్ల్లో చక్కర్లు కొడుతోంది. కేవలం పాట, ఫైట్‌కే శంకర్ రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నాడా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.