కొన్నేళ్లుగా కేవలం ఫ్లాప్స్ మాత్రమే చూస్తున్నాడు శర్వానంద్. కథలు మార్చాడు. దర్శకులను మార్చాడు. మేకోవర్ ఛేంజ్ చేశాడు. బట్ రిజల్ట్ మార్చుకోలేకపోయాడు. ప్రస్తుతం సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేసి ఉన్నాడు. దీనికి బాలకృష్ణ కెరీర్ లో స్పెషల్ గా నిలిచే నారీనారీ నడుమ మురారి అనే టైటిల్ పెట్టారు. ఇద్దరు హీరోయిన్లు. సంయుక్త, సాక్షి వైద్య. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ ను బట్టి చూస్తే కాస్త ఫ్రెష్ గానే కనిపిస్తోంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయిన హీరోల కథలు తెలుగు తెరకు కొత్తేం కాదు. అయినా ఆకట్టుకునే స్క్రీన్ ప్లే ఉంటే పాసైపోతుంది. దర్శకుడు గత సినిమాను బట్టి చూస్తే మంచి వినోదం ఆశించొచ్చు అనిపిస్తుంది.
ఇక ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. అయినా ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కారణమేంటీ అంటే.. మూవీకి ఇప్పటి వరకూ ఓటిటి బిజినెస్ కాలేదట. అంటే ఓటిటి సంస్థలేవీ ఈ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు అనే కదా అర్థం. మామూలుగా శర్వానంద్ లాంటి హీరో సినిమా అంటే ముందుకు వస్తారు. బట్ అతనికి 2017లో వచ్చిన శతమానం భవతి తర్వాత ఇప్పటి వరకూ విజయం లేదు. అందుకే ఓటిటిలు కూడా భయపడుతున్నాయేమో అనుకోవచ్చు. ఇది అతనికి 35వ సినిమా. ఇన్నేళ్లు అనుభవం ఉన్నా సరైన కథలు ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. ముఖ్యంగా చివరి సినిమా మనమే చూసి చాలామంది ఒక సినిమాను ఎలా రిలీజ్ చేయకూడదో తెలుసుకున్నారు. మొత్తంగా ఈ నారీ నారీ నడుమ మురారికి ముందు ఓటిటి బిజినెస్ అయితే తప్ప థియేటర్ డేట్ కోసం చూడరు అన్నమాట.