నారీనారీ నడుమ మురారి మూవీ అప్పుడే ఓటిటికి రెడీ అవుతోంది. ఈ మూవీ జనవరి 14న సాయంత్రం షో నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమాకు చాలా పెద్ద హిట్ అనే టాక్ వచ్చింది. శర్వానంద్ నుంచి చాలా కాలం తర్వాత హిట్ అయిన మూవీ ఇది. రాబ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన సినిమా. కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ తో మిక్స్ అయిన మూవీగా నిలిచిపోయింది. ఓ రకంగా సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని మూవీస్ లో జెన్యూన్ గా హిట్ అయిన మూవీగా ఇది టాక్ తెచ్చుకుంది. అలాంటి మూవీ నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఓటిటిలో విడుదల కావడం మాత్రం కాస్త అరుదైన విషయంగానే చెప్పాలి.
నారీనారీ నడుమ మురారిలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ ఇద్దరికీ ప్రాధాన్యం ఉన్న పాత్రలుగానే ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ నరేష్ పాత్ర హైలెట్ గా నిలిచిపోయింది. విపరీతంగా నవ్వించాడీ పాత్రలో. బాగా మెప్పించిన ఈ మూవీ ఓటిటిలో ఫిబ్రవరి 4నే స్ట్రీమ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ లోనే నారీ నారీ నడుమ మురారి స్ట్రీమ్ కాబోతోంది. ఓ రకంగా చూస్తే ఈ మూవీ ఓటిటిలో కూడా చాలా పెద్ద ప్లస్ గా నిలిచిపోయే అవకాశాలున్నాయి.