SHIVAJI: శివాజీ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న నటీమణులు

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నటీమణులు

Update: 2025-12-23 10:45 GMT

టా­లీ­వు­డ్ సీ­ని­య­ర్ నటు­డు శి­వా­జీ ని­న్న రా­త్రి ఒక సి­ని­మా ప్రీ-రి­లీ­జ్ ఈవెం­ట్‌­లో హీ­రో­యి­న్ల డ్రె­స్సిం­గ్ పై చే­సిన వ్యా­ఖ్య­లు తీ­వ్ర వి­వా­దా­న్ని రే­కె­త్తిం­చా­యి. సదరు ఈవెం­ట్‌­లో మా­ట్లా­డిన శి­వా­జీ, మహి­ళ­లు పూ­ర్తి­గా కప్పే దు­స్తు­లు ధరిం­చా­ల­ని, శా­రీ­లో­నే అందం ఉం­టుం­ద­ని అన్నా­రు. హీ­రో­యి­న్లు తాము ఇష్ట­మొ­చ్చి­న­ట్టు దు­స్తు­లు వే­సు­కుం­టే అప­ఖ్యా­తి పా­ల­వు­తా­ర­ని, మిస్ యూ­ని­వ­ర్స్ టై­టి­ల్స్ శారీ ధరిం­చిన వారే గె­లు­చు­కు­న్నా­ర­ని పే­ర్కొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­లో అను­చిత కా­మెం­ట్లు సైతం చే­శా­రు శి­వా­జీ. ఈ వ్యా­ఖ్య­లు సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్ కాగా, చాలా మంది నె­టి­జ­న్లు శి­వా­జీ­ని తీ­వ్రం­గా వి­మ­ర్శిం­చా­రు. ఇటీ­వల కొంత మంది సె­ల­బ్రీ­టీ­లు, దర్శ­కు­లు, మూవీ టీం సభ్యు­లు కొ­న్ని­సా­ర్లు ఈవెం­ట్స్ వేళ షా­కిం­గ్ కా­మెం­ట్స్ చే­స్తు­న్నా­రు. మరీ వా­ళ్ల మూ­వీ­కి ప్ర­మో­ష­న్ కోసం చే­స్తు­న్నా­రో లేదా ఏదో ఫ్లో­లో మా­ట్లా­డే­స్తు­న్నా­రో తె­లీ­దు కానీ మహి­ళ­ల­ను అగౌ­ర­వ­ప­ర్చే వి­ధం­గా కొంత మంది మా­ట్లా­డు­తు­న్నా­రు. దీం­తో వారి ఈవెం­ట్ లలో ఏదో ఒక రచ్చ జరి­గి వారి మూవీ కా­స్త రచ్చ­గా మా­రు­తుం­ది. ఈ క్ర­మం­లో తా­జా­గా... నటు­డు శి­వా­జీ హీ­రో­యి­న్ల చే­సిన కా­మెం­ట్స్ నె­ట్టింట దు­మా­రం­గా మా­రా­యి. దం­డో­రా మూవీ ప్రీ రి­లీ­జ్ ఈవెం­ట్‌­లో హీరో శి­వా­జీ చే­సిన వ్యా­ఖ్య­లు కాం­ట్ర­వ­ర్సీ­కి కే­రా­ఫ్ గా మా­రా­యి. శి­వా­జీ మా­ట్లా­డు­తూ... యాం­క­ర్ డ్రె­స్సిం­గ్ సె­న్స్‌­ను ప్ర­శం­సిం­చా­రు. అదే వి­ధం­గా హీ­రో­యి­న్ల వేష ధా­ర­ణ­పై మా­ట్లా­డిన మా­ట­లు వి­వా­దా­స్ప­దం­గా మా­రా­యి. హీ­రో­యి­న్ల అందం చీ­ర­లో, నిం­డు­గా కప్పు­కు­న్న బట్ట­ల్లో ఉం­టుం­ద­న్నా­రు.  సా­మా­న్లు కన్పిం­చే­లా బట్ట­లు ధరి­స్తే­చా­లా మంది లోపల బూ­తు­లు తి­ట్టు­కుం­టా­ర­ని అన్నా­రు.

అదే వి­ధం­గా.. స్త్రీ స్వే­చ్ఛ­ను ప్ర­స్తా­వి­స్తూ, స్వే­చ్ఛ అనే­ది అదృ­ష్ట­మ­ని, దా­న్ని మనం­చే­సే పను­ల­తో కో­ల్పో­కూ­డ­దం­టూ మా­ట్లా­డా­రు.  సా­వి­త్రి, సౌం­ద­ర్య­లు వారి వస్త్ర ధా­ర­ణ­తో చి­ర­స్థా­యి­గా గు­ర్తుం­డి­పో­యా­ర­న్నా­రు. ఈ వ్యా­ఖ్య­ల­పై దు­మా­రం చె­ల­రే­గిం­ది. దీ­ని­పై పలు­వు­రు హీ­రో­యి­న్లు శి­వా­జీ వ్యా­ఖ్య­ల్ని ఏకీ­పా­రే­స్తు­న్నా­రు. తా­జా­గా.. సిం­గ­ర్ చి­న్మ­యి దీ­ని­పై పె­ట్టిన పో­స్ట్ సం­చ­ల­నం­గా మా­రిం­ది. మహి­ళ­లు ట్రె­డి­ష­న­ల్ గా చీ­ర­లు ధరిం­చా­లా.. ?.. అయి­తే.. మీరు జీ­న్స్ లు, హు­డీ­లు మా­నే­సి బొ­ట్టు­పె­ట్టు­కు­ని,  ధో­తి­లు కట్టు­కొ­వా­ల­ని కౌం­ట­ర్ లు వే­శా­రు. అదే వి­ధం­గా పె­ళ్ల­యి­తే కం­క­ణం, మె­ట్టె­లు ధరిం­చా­ల­ని కూడా సె­టై­రి­క్ గా వ్యా­ఖ్య­లు చే­శా­రు.   అం­తే­కా­కుం­డా.. ఒక సి­ని­మా­లో వి­ల­న్ గా చేసి మొ­త్తం­గా పొ­కి­రీ­ల­కు హీరో అయ్యా­డం­టూ కూడా చి­న్మ­యి శి­వా­జీ­నీ ఏకీ­పా­రే­శా­రు. మహి­ళల డ్రె­స్సిం­గ్‌­ను టా­ర్గె­ట్ చే­య­డం ఎం­త­వ­ర­కు సమం­జ­స­మ­ని ఆమె సో­ష­ల్ మీ­డి­యా­లో సం­చ­లన పో­స్ట్ చే­శా­రు.

Tags:    

Similar News