Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మకు షాక్.. జైలు శిక్ష విధించిన కోర్ట్

Update: 2025-01-23 08:45 GMT

వివాదాస్మద దర్శకుడుగా మారిన రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని అంధేరి కోర్ట్ షాక్ ఇచ్చింది. కాకపోతే ఆ షాక్ నుంచి వెంటనే తేరుకున్నాడు. ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన సినిమాలు చేసిన వర్మ ప్రస్తుతం థర్డ్ గ్రేడ్ మూవీస్ రూపొందిస్తున్నాడు. ఈ విషయాన్ని తనే ఒప్పుకున్నాడు కూడా. పైగా మళ్లీ మారిపోయి పాత వర్మను చూపిస్తానని రీసెంట్ గా ‘సిండికేట్’అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఇది అతని రెగ్యులర్ స్టంట్స్ లో భాగమా లేక నిజంగానే చేస్తాడా అనేది పక్కన పెడితే ఓ చెక్ బౌన్స్ కేస్ లో వర్మకు అంధేరి కోర్ట్ లో చుక్కెదురైంది.

చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి మూడు నెలల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం, చెక్కు-బౌన్సింగ్ కేసులకు వ్యక్తులు జరిమానా విధించబడతారు. రూ.లక్ష జరిమానా చెల్లించాలని కోర్టు వర్మను ఆదేశించింది. అలాగే 3.72 లక్షలు ఫిర్యాదుదారుడికి చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మూడు నెలలు జైలులో ఉండవలసి ఉంటుంది.

2018లో మహేష్‌చంద్ర మిశ్రా ద్వారా శ్రీ అనే సంస్థ వర్మ కంపెనీకి వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత వర్మ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి తన కార్యాలయాన్ని విక్రయించాల్సి వచ్చింది. జూన్ 2022 లో, అతని కేసులో వర్మ దోషిగా నిర్ధారించబడ్డాడు. అయితే, అతను పిఆర్, 5000 నగదు భద్రతను అమలు చేస్తూ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

నిజానికి వర్మ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చెత్త సినిమాలు చేశాడు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనిపై కేస్ లు నమోదయ్యాయి. ఆ కేస్ ల్లోనే జైలుకు వెళతాడు అనుకున్నారు. చాలా రోజుల పాటు విచారణకు సహకరించలేదు. చివరికి నానా తంటాలు పడి ఈ కేస్ లోనూ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అంధేరి కోర్ట్ లోనూ అదే జరిగింది. బట్ అతని నోటి దురుసుకు ఏదో రోజు జైలుకు వెళ్లక తప్పదు అంటున్నారు జనం. 

Tags:    

Similar News