Drishyam 2 : దృశ్యం 2కి భారీ షాక్

Update: 2026-04-14 07:38 GMT

మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ దృశ్యం. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కంప్లీట్ మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఈ మూవీ అతి పెద్ద విజయం సాధించింది. దృశ్యంకు వచ్చిన రెస్పాన్స్ చాలామంది ఇన్స్ స్పైర్ అయ్యారు. దీంతో తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఏకంగా చైనాలో కూడా రీమేక్ అయిందీ మూవీ. 2013లో విడుదలైన ఈ మూవీ తర్వాత యేడేళ్లకు సెకండ్ పార్ట్ విడుదలైంది. దీనికీ అనూహ్యమైన విజయం అందించారు ఆడియన్స్. ఇక ఇప్పుడు దృశ్యం 3 కూడా రెడీగా ఉంది. ఈ మూవీని ఎన్నికల తర్వాత విడుదల చేయాలని భావించారు. ఆ కారణంగా ఆలస్యం అయింది. అయితే ఈ లోగా సెకండ్ పార్ట్ ను రీ రిలీజ్ చేయాలని భావించారు. ఈ నెల 10న దృశ్యం 2 రీ రిలీజ్ అయింది.

దృశ్యం 2కు దారుణమైన పరాజయం వచ్చింది. ఎవరూ ఊహించిన రేంజ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయిందీ మూవీ. మామూలుగా మోహన్ లాల్ మూవీస్ అంటేనే భారీ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద విజయం సాధించిన సినిమాకు రెండో రిలీజ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసి చాలామంది షాక్ తిన్నారు. 10న విడుదలైనా.. ఇప్పటి వరకు కేవలం అంటే కేవలం.. 5 లక్షలు మాత్రమే వచ్చాయి. కనీసం థియేటర్స్ రెంట్ కు కూడా రాలేదు అన్నమాట. మరి ఇంత దారుణమైన పరాజయం మాత్రం అస్సలెవరూ ఊహించలేదు. మరి దృశ్యం 3కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. 

Tags:    

Similar News