గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ టాప్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. డిఫరెంట్ గెటప్ తో జగపతిబాబు నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో చాలా మార్పులు వస్తున్నాయి. మామూలుగా అయితే మార్చి 27న రిలీజ్ అని మొదట అనౌన్స్ చేశారు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని చాలా తక్కువ టైమ్ లోనే ఏప్రిల్ 30న విడుదలవుతుందని ప్రకటించారు. బట్ ఈ డేట్ కు కూడా రావడం అసాధ్యం అని తేలిపోయింది. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ.. ఏప్రిల్ 30న మాత్రం రాదు అనేది క్లియర్. మామూలుగా అయితే పెద్ద హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ విషయంలో మాత్రం ఓటిటి వాళ్ల నుంచి ఇబ్బందులు తప్పవు. బట్ నెట్ ఫ్లిక్స్ ఈ విషయంలో పెద్ది విషయంలో లైట్ తీసుకోబోతోంది.
యస్.. పెద్ది మూవీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు ఉన్నా.. వాయిదాలు పడ్డా.. మా టీమ్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ నెట్ ఫ్లిక్స్ చెప్పింది. మూవీ బాగా వస్తోంది. భారీ విజయం ఖాయం అనేది తేలిపోయింది. ఆ కారణంగా ఈ మూవీకి పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అని నెట్ ఫ్లిక్స్ తేల్చింది. ఆ మేరకు దర్శకుడితో పాటు నిర్మాణ సంస్థ కూడా క్లియర్ గా చెప్పింది. ఈ మూవీ ఎప్పుడు వచ్చినా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ కారణంగా మా వల్ల ఇబ్బంది రావొద్దు అని భావించే.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం అని చెప్పారు.
మామూలుగా అయితే పెద్ద సినిమాల వాయిదాలు అన్నీ ఓటిటి సంస్థల చేతుల్లోనే ఉంటున్నాయి. కొన్నాళ్లుగా ఇదే కనిపిస్తోంది. వాళ్లు చెప్పిన టైమ్ కు మూవీ రాకపోతే డీల్స్ క్యాన్సిల్ చేయడం లేదంటే డబ్బులు తగ్గించడం వంటివి చేస్తుంటాయి. ఓ రకంగా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఓటిటి వాళ్ల చేతుల్లో పడిపోయాయి. వాళ్లు చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా మారింది. అది కూడా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి భారీ ఓటిటి సంస్థల వల్ల. అలాంటిది నెట్ ఫ్లిక్స్ తామే స్వయంగా ఈ మూవీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తాం అని చెప్పారు అంటే మాటలు కాదు. ఓ రకంగా పెద్ది మూవీకి ఇదో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి.