కాబోయే భర్త ఎలా ఉండాలి? తనకు ఎలాంటి గుణగణాలుండాలి? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది చెన్నయ్ బ్యూటీ శ్రుతిహాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ "నేను సింగిలే. ప్రస్తుతానికి నా రిలేషన్ కెరీర్‌తోనే. ఇక ఏ వ్యక్తికైనా శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉండటం ముఖ్యం కాదు. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. సృజనాత్మక భావాలు, స్పూర్తినింపే ఆలోచనలు మనిషికి ఆభరణాలు. ఈ లక్షణాలున్న వ్యక్తి తారసపడితే, తనకూ నేను నచ్చితే తప్పకుండా పెళ్లాడతా. ఆదర్శవంతమైన భాగస్వామి ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా ఉంటాడు. నేను అలాంటి వ్యక్తినే ఇష్టపడతా" అని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ సలార్ 2 కోసం ఎదురుచూస్తోంది.