Shyam Singha Roy: 'చంద్రముఖి'లో జ్యోతికలా.. 'శ్యామ్ సింగరాయ్' స్టోరీ లీక్..?
Shyam Singha Roy: టాలీవుడ్‌లో వారానికొక సినిమా విడుదలవుతూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి హిట్ కొడుతోంది.;
Shyam Singha Roy (tv5news.in)
Shyam Singha Roy: టాలీవుడ్‌లో వారానికొక సినిమా విడుదలవుతూ.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసి హిట్ కొడుతోంది. ఇక ఈ వారం అలా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమానే శ్యామ్ సింగరాయ్. నేచురల్ స్టార్ నాని సినిమాలంటే మామూలుగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. కానీ తన రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి ఈసారి శ్యామ్ సింగరాయ్ అనే డిఫరెంట్ కథతో వస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
మామూలుగా ఏదైనా సినిమా ట్రైలర్ విడుదల అవ్వగానే.. దాని కథ ఏంటో అంచనా వేయడం మొదలుపెట్టేస్తారు ప్రేక్షకులు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా విషయంలో కూడా జరిగింది. ట్రైలర్‌లో నాని రెండు వేర్వరు లుక్స్‌లో కనిపించడంతో ఇదొక పీరియాడిక్ సినిమా అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇది పునర్జన్మ కథతో తెరకెక్కిన చిత్రం అనుకున్నారు. కానీ కాదని.. శ్యామ్ సింగరాయ్ కథ ఇదేనని ఓ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాని.. ఈ సినిమాలో ఓ డైరెక్టర్ అవ్వాలనుకునే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తీసి ఫీచర్ ఫిల్మ్‌ను చేయాలనుకునే నాని.. ఓ పీరియాడిక్ సినిమాను తెరకెక్కించాలన్న ఉద్దేశ్యంతో కథను వెతుక్కుంటూ కోలకత్తాకు వెళతాడు. అక్కడే తాను ఒకప్పటి రైటర్ శ్యామ్ సింగరాయ్ గురించి తెలుసుకుంటాడు. అతడి గురించి చదువుతూ.. నానినే శ్యామ్ సింగరాయ్ అని ఊహించుకోవడం మొదలుపెడతాడు.
చంద్రముఖిలో జ్యోతికలా తన గురించి చదువుతూ చదువుతూ తానే శ్యామ్ సింగరాయ్ అని నమ్మడం మొదలుపెడతాడు నాని. అలాగే హైదరాబాద్‌కు తిరిగొస్తాడు. ఆ తర్వాత తన జీవితంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కున్నాడు అనేది క్లైమాక్స్ అని టాక్. సైన్స్‌ను, సైన్స్‌కు అర్థం కాని శక్తులను కలిపి ట్యాక్సీవాలా లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సాంకిృత్యాన్.. శ్యామ్ సింగరాయ్‌తో మళ్లీ మ్యాజిక్ చేస్తాడని కథ గురించి తెలుసుకున్న వారు అనుకుంటున్నారు.